»Alert Delete These 19 Dangerous Google Play Apps On Your Phone Amazing Wallpaper To Private Messenger Check List
Dangerous Apps : మీ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా.. వెంటనే డిలీట్ చేయండి
ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను నిండాముంచుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్ల పేర్లతో లింకులను పంపి వాటిని ఓపెన్ చేయగానే సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని, వాళ్ల బ్యాంకుల్లో సొమ్ములను కాజేస్తున్నారు.
Dangerous Apps : ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు పెరిగిపోయాయి. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను నిండాముంచుతున్నారు. ఆకర్షణీయమైన ఆఫర్ల పేర్లతో లింకులను పంపి వాటిని ఓపెన్ చేయగానే సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని, వాళ్ల బ్యాంకుల్లో సొమ్ములను కాజేస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలంటూ ఎన్ని ప్రకటనలు చేసిన, జనాలు ఎంత జాగ్రత్తగా ఉన్నా దోపిడీలు ఆగడం లేదు. ప్రస్తుతం ఎవరి చేతిలో చూసిన స్మార్ట్ ఫోన్లే కనిపిస్తున్నాయి. వాటిలో రకరకాల యాప్‌లు అవసరానికి డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగిస్తున్నాం. వాటిలో కొన్ని హానికర యాఫ్స్ కూడా ఉంటాయి. వాటిని గుర్తించకపోతే ప్రమాదాల్లో చిక్కుకోవల్సి వస్తుంది. అలాంటి 19 రకాల ప్రమాదకరమైన యాప్స్‌ను వెంటనే తమ ఫోన్ల నుంచి డిలీట్ చేయాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గత పదేళ్లలో సైబర్ కేటుగాళ్లు ఆండ్రాయిడ్ ఫోన్లను ఆసరగా చేసుకొని పలు వైరస్ల సాయంతో యూజర్ల వ్యక్తిగత డేటాను సేకరిస్తున్నట్లు మాల్వేర్ ఫాక్స్ ఓ నివేదికలో తెలిపింది. ఇందుకు కేటుగాళ్లు హార్లీ ట్రోజన్, జోకర్ స్పైవేర్, ఆటోలైకోస్ మాల్వేర్లను ఉపయోగిస్తున్నారు. మాల్వేర్లను వినియోగదారులు సర్వసాధారణంగా వినియోగించే యాప్‌లలోకి వైరస్‌ను పంపిస్తారు. అనంతరం వారికి కావాల్సిన డేటాను కలెక్ట్ చేసుకొని డార్క్‌వెబ్‌లో అమ్ముకుంటున్నట్లు పేర్కొంది. ఇక మాల్వేర్ ఫాక్స్ నిర్ధారించిన 19 యాప్స్‌లలో ఇవి ఉన్నాయి. ఆ యాప్స్ మీ ఫోన్లలో ఉంటే వెంటనే డిలీట్ చేయాలని రిపోర్ట్‌లో నివేదించింది. అవి ఫేర్ గేమ్ హబ్ అండ్ బాక్స్, హోప్ కెమెరా- పిక్చర్ రికార్డ్, సేమ్ లాంచర్, లైవ్ వాల్ పేపర్, అమేజింగ్ వాల్ పేపర్, కూల్ ఎమోజీ ఎడిటర్ అండ్ స్టైకర్, సింపుల్ నోట్ స్కానర్, యూనివర్సల్ పీడీఎఫ్ స్కానర్, ప్రైవేట్ మెసేంజర్, ప్రీమియం ఎస్ఎంఎస్, బ్లడ్ ప్రజర్ చకర్, కూల్ కీబోర్డ్, పెయింట్ ఆర్ట్, కలర్ మెసేజ్, వ్వాల్గ్ స్టార్ వీడియో ఎడిటర్, క్రియేటీవ్ 3డీ లాంచర్, వావ్ బ్యూటీ కెమెరా, జిఫ్ ఎమోజీ కీబోర్డ్, ఇన్స్టంట్ హార్ట్‌రేట్ ఎనీటైమ్ వంటి యాప్స్ ఉన్నాయి.