»The Highest Railway Cable Bridge In The Country Here Is The Video
Cable railway bridge : దేశంలో ఎత్తయిన రైల్వే తీగల వంతెన.. వీడియో ఇదిగో
మన దేశ నిర్మాణ రంగంలో మరో అద్భుతం వచ్చి చేరనుంది. జమ్మూ అండ్ కశ్మీర్ (Jammu and Kashmir)ప్రాంతంలోని కాట్రా, బనిహాల్ మధ్య 111 కిలోమీటర్ల మార్గంలో ఈ ప్రాజెక్టు నిర్మితమవుతోంది. పనులు తుది దశకు చేరుకున్నాయి.
జమ్ములోని రైసీ జిల్లాలో చేపట్టిన మొట్ట మొదటి తీగల రైల్వే వంతేన నిర్మాణం సిద్దమైంది. రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఈ విషయాన్నితెలిపారు. 11 నెలల వ్యవధిలో ఈ కేబుల్ రైల్వే బ్రిడ్జ్ (Cable railway bridge) నిర్మాణం పూర్తిచేసినట్లు ఆయన ట్విటర్ వేదికగా వెల్లడించారు. వంతెనను మొత్తంగా 96 ప్రధాన తీగలతో అనుసంధానించినట్లు రైల్వే మంత్రి చెప్పారు. మొత్తం తీగల పొడవు 653 కిలోమీటర్లు ఉందని వెల్లడించారు. తీగల అమరిక పనులకు సంబంధించిన వీడియోనూ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi).. ‘ఎక్స్లెంట్’ అని ప్రశంసించారు.
సుమారు రూ.400 కోట్ల వ్యయంతో ఈ వంతెన పనులు చేపట్టారు. మొత్తం పొడవు 725 మీటర్లు.అంజీ ఖడ్ (Anji Khad) తీగల రైల్వే వంతెన.. జమ్మూ- బారాముల్లా (Baramulla) మార్గంలోని కాట్రా- రైసీ సెక్షన్లను కలుపుతుంది. హిమాలయ పర్వతాల మధ్య అంజీ ఖడ్ నదిపై దాదాపు 1086 అడుగుల ఎత్తులో దీన్ని నిర్మించారు. ఈ బ్రిడ్జి 216 కిలోమీటర్ల వేగంతో వచ్చే గాలులను కూడా తట్టుకుంటుందని అధికారులు తెలిపారు. ఈ వంతెనను తొలుత చీనాబ్ నది(River Chenab)పై నిర్మించిన ఆర్చ్ బ్రిడ్జి తరహాలో నిర్మించాలనుకున్నారు. కానీ, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని చివరికి తీగల వంతెనను ఖరారు చేశారు.