»Mekapati Chandra Shekhar Reddy Comments On Mlc Elections
MLC Elections : క్రాస్ ఓటింగ్ పై మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఏమన్నారంటే..!
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె గెలిచిందని, నలుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అధికార పార్టీ ఆరోపిస్తోంది.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె గెలిచిందని, నలుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అధికార పార్టీ ఆరోపిస్తోంది.
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి క్రాస్ ఓట్ వేశారని వైస్సార్సీపీ ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే తనపై వస్తున్న ఆరోపణల ఫై ఉండవల్లి శ్రీదేవి క్లారిటీ ఇవ్వగా..తాజాగా మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
తాను ఎలాంటి క్రాస్ ఓటింగ్ కి పాల్పడలేదని ఆయన పేర్కొన్నారు. తాను ఓటు వేసిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చానని అన్నారు. ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా వదిలి వచ్చిన వాడిని అని పేర్కొన్నారు. టికెట్ ఇస్తే పోటీ చేస్తా…లేదంటే లేదని తేల్చి చెప్పారు. నియోజకవర్గంలో తాను ఏంటో చూపిస్తానని… జగన్ కూడా టికెట్ విషయంలో నాకు సానుకూలంగా లేరని పేర్కొన్నారు. ఎవరో తన మీద తప్పుడు సమాచారం ముఖ్యమంత్రి కి ఇచ్చారని మండిపడ్డారు.