తెలంగాణలో అత్యంత వైభవోపేతంగా జరిగిన మేడారం సమ్మక్క, సారాలమ్మ జాతరకు సంబంధించిన హుండీలను లెక్కించడం ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
medaram hundi counting : తెలంగాణ కుంభమేళగా పేరు గాంచిన మేడారం సమ్మక్క(sammakka), సారాలమ్మ జాతర అత్యంత వైభవోపేతంగా జగింది. అనేక రాష్ట్రాల నుంచి అశేష ప్రజానీకం వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. మొక్కలు చెల్లించుకుని వెళ్లారు. ఇప్పుడు ఆ వేడుకల్లో పెట్టిన హుండీలను లెక్కించేందుకు అధికారులు సమాయత్తం అయ్యారు. గురువారం హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో మేడారం హుండీల లెక్కింపు ప్రారంభం అయ్యింది.
ఈ మేడారం(medaram) జాతర సందర్భంగా మొత్తం 512 హుండీలను ఆ ప్రాంతంలో పెట్టారు. ఇవన్నీ ఇప్పుడు భక్తుల కానుకలతో నిండిపోయాయి. దీంతో వీటిని లెక్కించడం ప్రారంభించారు. దాదాపుగా పది రోజుల పాటు ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని తెలుస్తోంది.
ఈ లెక్కింపు కోసం ముందు ఎండోమెంట్, రెవిన్యూ, జాతర ట్రస్టు బోర్డు సభ్యులు కలిసి పోలీసుల సమక్షంలో హుండీలను తెరిచారు. ఈ లెక్కింపులో దేవాదాయ శాఖ సిబ్బందితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, భక్తి మడళ్ల సభ్యులు తమ సేవలను అందిస్తున్నారు. పోలీసులు నిరంతరం అక్కడ పహారా కాస్తున్నారు. సీసీ కెమేరాల నిఘా మధ్య అత్యంత కట్టుదిట్టంగా హుండీల లెక్కింపు ప్రక్రియ జరుగుతోంది. లెక్కింపు పూర్తిగా పూర్తయిన తర్వాత ఎంత మొత్తం వచ్చిందనే విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తారని తెలుస్తోంది.