»Lost Luxury Cars Way Of Mumbai Floods Sunny Leone Cried
Sunny Leone: పోయిన లగ్జరీ కార్లు..ఏడ్చిన సన్నీ లియోన్
సన్నీ లియోన్(Sunny Leone)కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. గూగుల్‌లో భారతీయులు అత్యధికంగా శోధించిన సెలబ్రిటీ ఆమెనని ఇప్పటికే చూశాం. సన్నీ లియోన్ చివరిసారిగా తెలుగు చిత్రం జిన్నాలో కనిపించింది. ఇందులో ఆమె మంచు విష్ణుతో రొమాన్స్ చేసింది. అయితే ఈ అమ్మడు తన గురించి ఓ కీలక విషయాన్ని పంచుకున్నారు.
Lost luxury cars way of mumbai floods Sunny Leone cried
నటి సన్నీ లియోన్(Sunny Leone) తన గురించి ఓ ఆసక్తికరమైన విషయం వెల్లడించింది. ఖరీదైన కార్లను పోగొట్టుకున్నట్లు ఆమె తెలిపింది. సహజంగా తనకు వర్షాకాలం అంటే ఎంతో ఇష్టమని, పైగా ముంబై వాతావరణం అంటే ఎంతో ఇష్టపడతానని వెల్లడించింది. ఆ క్రమంలో ముంబైలో స్థిరపడటానికి, బీచ్ దగ్గరగా ప్లాట్ తీసుకోవడానికి అదే ప్రధాన కారణమని చెప్పుకొచ్చింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు.. తనను భయపెట్టాయని, ఇంత భారీ వర్షం పడుతుందని అసలు ఊహించలేకపోయానని వెల్లడించింది.
కాగా, ఈ వర్షాల(rains)కు తాను మూడు కార్లు పోగొట్టుకున్నానని స్పష్టం చేసింది. ఒకే రోజు రెండు కార్లు పోయానని ఆమె చెప్పడం విశేషం. ఒకేరోజు రెండు లగ్జరీ కార్లు(luxury cars) నీటిలో కొట్టుకునిపోతుంటే చూస్తూ ఉండిపోయానే తప్ప.. ఏమీ చేయలేకపోయినట్లు సన్నీ లియాన్ అన్నారు. ఇది అత్యంత భయానకమని పేర్కొన్నారు. వరదనీటిలో కొట్టుకుపోతున్న కార్లను చూస్తే ఏడుపొచ్చిందని చెప్పుకొచ్చారు. ఇంపోర్టెడ్ కార్లను కొనుగోలు చేసినప్పుడు వాటికి కట్టే పన్ను చాలా ఎక్కువగా ఉంటోందని అన్నారు.
ఎనిమిది సీట్ల మెర్సిడెస్ కారు(car) అంటే తనకు చాలా ఇష్టమని, ప్రేమతో దాన్ని చూసుకున్నానని సన్నీ లియాన్ అన్నారు. అది నీటిలో కొట్టుకుపోయిందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపారు. ఇప్పుడు ఇండియన్ మేడ్ కార్లను కొనడానికే తాను ఇష్టపడుతున్నానని, అవి వర్షాకాల సీజన్‌కు అనుగుణంగా ఉంటాయని ఆమె చెప్పడం విశేషం.