»Nelson Dilip Kumar Rajinikanth Jailer Movie Review
Jailer Movie Review: జైలర్ మూవీ ఫుల్ రివ్యూ
సూపర్‌స్టార్ రజినీకాంత్ గత సినిమాలతో అభిమానులు నిరాశపడ్డారని ఈసారి మెప్పించే కథతో, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్‌తో ఈరోజు(ఆగస్టు 10న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ ఎంటర్టైనర్గా నేడు థియేటర్లో విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
సూపర్‌స్టార్ రజినీకాంత్ గత సినిమాలతో అభిమానులు నిరాశపడ్డారని ఈసారి మెప్పించే కథతో, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం జైలర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు(Jailer Movie Review). తమన్నా డ్యాన్స్ చేసిన కావలయ్య పాటతో సినిమాకు మంచి ప్రచారం దొరికింది. అంతేకాకుండా ప్రీరిలీజ్ ఈవెంట్లో రజినీ మాటలు కూడా సినిమాపై భారీ అంచనాలు పెంచేలా చేసింది. మరీ ఇన్ని అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకలను ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ:
టైగర్ ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) (Rajinikanth) భిన్నభావాలున్న కఠినమైన జైలర్(Jailer)గా పని చేసి రిటైర్మెంట్ తీసుకున్న తరువాత భార్య, కొడుకు, మనవడు కోడలితో చెన్నైలో సంతోషంగా గడుపుతుంటారు. విరమణ తరువాత మనువడికి యూట్యూబ్ ఛానెల్ నడిపించడంలో తోడ్పడుతుంటాడు(Jailer Movie Review). ముత్తువేల్ కొడుకు అర్జున్ నిజాయితీగల ఒక పోలీసు ఆఫీసర్. ఒక కేసును దర్యాప్తు చేస్తున్నప్పుడు అర్జున్ తప్పిపోతాడు. అంతేకాకుండా హంతకుల చేతిలో మరణించాడని తెలుస్తుంది. ముత్తువేల్ జైలర్ గా ఉన్నప్పుడు ఖైదీలను క్రమశిక్షణలో ఉంచడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకునేవాడు. అయితే అదే జైల్లో ఓ గ్యాంగ్ స్టర్‌ను తప్పిస్తే తన కొడుకును ప్రాణాలతో వదిలేస్తా అని ముత్తువేల్‌ను డిమాండ్ చేస్తారు(Jailer Movie Review). దీంతో ముత్తువేల్ ఏం చేశారు? కొడుకును కాపాడేందుకు ముత్తువేల్ స్కెచ్ ఏంటి? స్టార్ కాస్టింగ్‌తో నిండిన ఈ సినిమాలో వారి పాత్రేమిటి అనేది తెలియాలంటే జైలర్ చూడాల్సిందే.
విశ్లేషణ:
జైలర్ స్టార్ కాస్టింగ్ అతిధి పాత్రలతో నిండిన కంప్లీట్ రజనీకాంత్ చిత్రం అని చెప్పొచ్చు. అయితే వీరికి స్క్రీన్ స్పేస్ కొంచె తక్కువే ఉంటుంది. ఈ సినిమాతో రజినీ ఈజ్ బ్యాక్ అని చెప్పవచ్చు. బీస్ట్ చిత్రంతో పెద్ద పాఠం నేర్చుకున్న డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్.. ఇప్పుడు జైలర్‌తో అలాంటి తప్పులు పునరావృతం కాకుండా చూసుకున్నారు(Jailer Movie Review). ఫస్ట్ అంతా సెటప్‌తో ఎంతో ఉత్కంఠభరితంగా సాగించి గూజ్బంప్స్ వచ్చే ట్విస్ట్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది. ఇక సెకండ్ ఆఫ్ ప్రారంభం అయిన తరువాత క్షణం కూడా తీరికా లేకుండా యాక్షన్ సన్నివేశాలతో కట్టిపడేస్తాడు. సెకండ్ ఆఫ్‌లో ముఖ్యంగా మోహన్‌లాల్ పాత్ర అద్బుతంగా ఉంటుంది. మాథ్యూ పాత్రలో అతని నటన అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. నరసింహగా శివరాజ్ కుమార్ కూడా తన లుక్స్, బాడీ లాంగ్వేజ్‌తో అబ్బురపరుస్తాడు.
యోగి బాబు తన చమత్కారమైన వన్-లైనర్లతో వేసిన పంచులు పేలుతాయి. అలాగే రజనీకాంత్ కాంబినేషన్లో వచ్చే సన్నివేశాలు అద్బుతంగా కుదిరాయి. నెల్సన్ ట్రేడ్‌మార్క్ డార్క్ కామెడీ సినిమాలో నవ్వులు పూయిస్తుంది. విలన్‌గా వినాయకన్ తన నటనతో మెప్పిస్తాడు. ఈ చిత్రంలో అనేక గూస్బంప్స్ మూమెంట్స్ ఉన్నాయి. ఇక టెక్నికల్ విషయానికి వస్తే అనిరుధ్ సంగీతం చిత్రానికి బ్యాక్‌బోన్. తన బీజీతో రజనీ యాక్షన్ సన్నివేశాలను నెక్ట్స్ లెవల్‌కు ఎలివేట్ చేశాడు. సాధారణంగా నడిచే సన్నివేశం కూడా అతని BGM కారణంగా థీయేటర్లో గూజ్బంప్స్ వస్తాయి(Jailer Movie Review). అలాగే సినిమాటోగ్రఫర్ విజయ్ కార్తీక్ కన్నన్ ఫ్రేమ్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. లైటింగ్, కలర్స్ చాలా సహజంగా ఉన్నాయి. అలాగే యాక్షన్ సన్నివేశాలు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. ఆర్ట్ డైరెక్టర్ కిరణ్ రియలిస్టిక్ సెట్ వర్క్ కూడా మెప్పిస్తుంది.