»Ktr Shocking Comments On Modi Government Over Ed Notices To Kavitha
KTR: దద్దమ్మలం కాదు, కవిత విచారణ ఎదుర్కొంటుంది.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ( delhi liquor scam case ) తన సోదరి కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha ) ఈడీ విచారణకు వెళ్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ( Telangana IT minister ) కల్వకుంట్ల తారక రామారావు ( Kalvakuntla Kavitha ) గురువారం స్పష్టం చేసారు .
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ( delhi liquor scam case ) తన సోదరి కల్వకుంట్ల కవిత ( kalvakuntla kavitha ) ఈడీ విచారణకు వెళ్తుందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ( Telangana IT minister ) కల్వకుంట్ల తారక రామారావు ( Kalvakuntla Kavitha ) గురువారం స్పష్టం చేసారు . తమపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని, ఈ వేధింపులకు తాము కూడా రాజకీయంగానే సమాధానం చెబుతామన్నారు . ఆయన హైదరాబాద్ లో ( Hyderabad ) మీడియాతో మాట్లాడారు . బీజేపీ ప్రభుత్వంలో ( BJP government ) రాజకీయ వేధింపులు కవిత ( MLC Kavitha ) కేసే మొదటిది కాదు.. చివరిది కాదన్నారు . కవితకు వచ్చినవి ఈడీ సమన్లు ( ED summons ) కాదని.. మోడీ సమన్లు అన్నారు . ఈ సమన్లు రాజకీయమే ( Politics ) కానీ, అసలైనవి కావన్నారు . బీజేపీ విచారణ సంస్థలు ఈడీ ( ED ) , సీబీఐలను ( CBI ) ప్రతి పక్షాల పైన ఉపయోగిస్తోందన్నారు . ఈ సంస్థలు బీజేపీ అనుబంధ సంస్థల్లా మారిపోయాయన్నారు. ఈ సంస్థలు వేటకుక్కల వంటి సంస్థలు అన్నారు. ఇవి మోడీ ప్రభుత్వం చేతిలో కీలు బొమ్మ అన్నారు . మమ్మల్ని ఎదుర్కోలేక మా పైన ఈడీ , సీబీఐ దాడులు చేస్తోందన్నారు . మోడీ ప్రభుత్వం వచ్చాక 95 శాతం ఈడీ , సీబీఐ దాడులు ప్రతి పక్షాల పైన జరుగుతున్నాయన్నారు. మోడీ వచ్చాక ఇప్పటి వరకు 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయని , కానీ నేరం నిరూపించబడినవి మాత్రం 23 మాత్రమే అన్నారు . విపక్షాల మీద బురద జల్లడమే పనిగా పెట్టుకున్నారన్నారు . కాంగ్రెస్ మీద 24 , టీఎంసీ మీద 19 , ఎన్సీపీ మీద 11 కేసులు , ఉద్ధవ్ థాకరే మీద 8 కేసులు ఇలా విపక్షాల మీదనే ఉన్నాయన్నారు .
కవిత విషయంలో ఏదో జరుగుతుందనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు .
నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయబోయి అడ్డంగా దొరికిపోయిన బీఎల్ సంతోష్ ( BL Santhosh ) వలె తాము కోర్టుకు పోయి స్టే తెచ్చుకోమని చెప్పారు . అతనో దగుల్బాజీ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వారిలా మేం పారిపోమని, దద్దమ్మలం కాదని, విచారణను తప్పనిసరిగా ఎదుర్కొంటామన్నారు . ఎనిమిదేళ్లుగా జరుగుతున్న ప్రహసనంలో భాగంగా .. అయితే జుమ్లా లేదా హమ్లా అన్నట్లుగా వ్యవహరిస్తూ తన సోదరికి నోటీసులు ( ED Notices to Kavitha ) ఇచ్చారన్నారు . తెలంగాణతో ( Telangana ) పాటు దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ ( BRS ) దూసుకెళ్తుందనే ఆందోళనతో ఆమెకు సమన్లు వచ్చాయన్నారు . లిక్కర్ స్కాంలో పిలిచినందుకు
ప్రధాని మోడీ దేశాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు . ఆరు ఎయిర్ పోర్టులను అదానీ కి అప్పనంగా కట్టబెట్టారని ఆరోపించారు . మోడీకి అదానీ బినామీ అని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడన్నారు . మోడీ తన తొమ్మిదేళ్ల పాలనలో తొమ్మిది రాష్ట్రాలను కూల్చేశారన్నారు . బీబీసీ నివేదిక తర్వాత రూ.13 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైనా కేంద్రం మెదపడం లేదన్నారు . ఇన్నాళ్లు డబుల్ ఇంజిన్ అంటే ఏమో అనుకున్నామని, ఒకటో ఇంజిన్ మోడీ, రెండో ఇంజిన్ అదానీ అన్నారు . నీతి లేని పాలనకు , నిజాయితీ లేని పాలనకు మోడీ ప్రభుత్వం నిదర్శనంగా నిలిచిందన్నారు . మోడీకి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే దమ్ము లేదన్నారు . బీబీసీ పైన దాడి జరిగిన తనకు భారత మీడియా ఎంత అనే అహంకారం ప్రదర్శిస్తున్నారన్నారు .