యష్ KGF చాప్టర్ 2 విడుదలై సంవత్సరం అయ్యింది. ఇది బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో KGF స్టార్ నెక్ట్స్ చిత్రం ఎంటని ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో యష్(yash) ఓ లెడీ డైరెక్టర్ తో మూవీ చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రం యాక్షన్ నేపథ్యంలో రానున్నట్లు సమాచారం.
కెజియఫ్ సిరీస్ సినిమాలతో పాన్ ఇండియా స్టార్డమ్ అందుకున్న కన్నడ రాకింగ్ స్టార్ యశ్(yash). ఇండియా లెవల్లో రాఖీభాయ్‌కి మంచి క్రేజ్ ఉంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కించినన కేజీయఫ్ సినిమాలో.. యశ్ కటౌట్, స్క్రీన్ ప్రజెన్స్‌కు మాస్ ఆడియెన్స్ ఫిదా అయిపోయారు. అయితే కెజియఫ్2 రిలీజ్ అయి ఏడాది అయిపోయినా.. యశ్ నుంచి మరో ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ రాలేదు. యశ్ కోసం బడా బడా ప్రొడక్షన్స్ సినిమాలు చేసేందుకు ట్రై చేస్తున్నాయి. తెలుగు నుంచి దిల్ రాజు కూడా యశ్‌తో సినిమాను ప్లాన్ చేస్తున్నాడు. కానీ దానికి ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఇక కెజియఫ్ 3 ఎలాగు లైన్లో ఉంది. అయినా ప్రశాంత్ నీల్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా.. ఇప్పట్లో చాప్టర్ 3 రావడం కష్టమే.
ఈ క్రమంలో యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? డైరెక్టర్ ఎవరు? అనేది గత కొద్ది రోజులుగా సస్పెన్స్‌గా మారింది. ఆ మధ్యలో ప్రశాంత్ నీల్ శిష్యుడు కన్నడ డైరెక్టర్ నార్థన్‌తో ఓ సినిమా ఉంటుందని వినిపించింది. అలాగే స్టార్ డైరెక్టర్ శంకర్ కూడా యశ్‌తో బిగ్ ప్లానింగ్‌లో ఉన్నట్టు ప్రచారం జరిగింది. కానీ ఇలాంటి వార్తల్లో ఇప్పటి వరకు అధికారిక ప్రకటన లేదు. అయితే ఇప్పుడు ఊహించని డైరెక్టర్‌తో యశ్ సినిమా చేయబోతున్నట్టు తెలుస్తోంది. నేషనల్ అవార్డు విన్నర్, మళయాళీ లేడి డైరెక్టర్ గీతు మోహన్‌దాస్‌కు యశ్ ఓకె చెప్పినట్టు సమాచారం.
ఆమె చెప్పిన కథ యష్‌కి బాగా నచ్చేసిందట. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని టాక్. ఇదే నిజమైతే.. ఖచ్చితంగా ఇది ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అనే చెప్పాలి. మరి యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు(upcoming project) ప్రకటిస్తాడో చూడాలి.