The Kerala Story: ‘కేరళ స్టోరీ’ వివాదం.. మేకర్స్ ఏమంటున్నారు!?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా మే 5న రిలీజ్‌కు రెడీ అవుతున్న కేరళ స్టోరీ(The Kerala Story) సినిమా గురించే చర్చ జరుగుతోంది. ఈ సినిమా పై రాజకీయ వాతావరణం వేడెక్కింది. కేరళ సహా పలు ప్రాంతాల్లో ఈ సినిమాపై వివాదం చెలరేగుతోంది. అయినా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకొని రిలీజ్‌కు రెడీ అవుతోంది.సెన్సార్ వాళ్లు 10 కట్స్‌తో 'ఏ' సర్టిఫికేట్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు సుప్రీంకోర్టు(supreme court) ఈ సినిమా విడుదల గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంతేకాదు ఈ సినిమా విడుదలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్స్ను తోసిపుచ్చింది. మరి ఈ సినిమా మేకర్స్ ఏమంటున్నారు?
కేరళ స్టోరీ(The Kerala Story) సినిమాను కేరళలో ఉన్న రాజకీయ పార్టీలు బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. కేరళలోనే కాదు.. ఏకంగా తమిళనాడు ప్రభుత్వానికి ఆ రాష్ట్ర ఇంటెలిజెన్స్ తీవ్ర హెచ్చరికలు కూడా జారీ చేసింది. తమిళనాడులో ఈ సినిమా విడుదలైతే పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వెల్లడించింది. ఇలాంటి హెచ్చరికలు చేస్తున్నారంటే.. కేరళ స్టోరీ సినిమా పై ఎంత రాద్దాతం జరుగుతుందో ఊహించుకోవచ్చు. ఇదిలా ఉండగానే.. ఈ సినిమా నిర్మాత విపుల్ అమృత్లాల్ షా ఈ చిత్రానికి బిజెపి నిధులు సమకూరుస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు.
చిత్రనిర్మాతలుగా తమకు ‘ఏ రాజకీయ పార్టీ(political party)తో సంబంధం లేదు’ అని అన్నారు. సినిమా చూడకుండా సినిమా గురించి మాట్లాడేది అంతా ఊహ అని అన్నారు. ‘మేము ఏ రాజకీయ పార్టీకి ప్రతిస్పందించకూడదని అనుకుంటున్నాము. మేము సినిమా నిర్మాతలం.. మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. రాజకీయ పార్టీకి ప్రతిస్పందించలేనని’ అన్నారు. అయినా కూడా ఈ సినిమా పై వివాదం ముదురుతూనే ఉంది.
కేరళలో 32,000 మంది హిందూ, క్రిస్టియన్ మహిళలు ఇస్లాంలోకి మార్చబడ్డారని, ఇందులో కొంత మంది ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితం అయ్యారని, వాళ్లు ఐసిస్(ISIS) పోరాటానికి మద్దతుగా సిరియా వెళ్లారనేది ఈ సినిమా కాన్సెప్ట్. అందుకే ది కేరళ స్టోరీపై వివాదలు చెలరేగుతున్నాయి. మరి ఫైనల్‌గా కేరళ స్టోరీ వివాదం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి.