బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపారు. గతేడాది ఆపరేషన్ అయిన ఆయన ప్రస్తుతం కర్ర సాయం లేకుండా నడుస్తున్నారు. ఈ క్రమంలో మ్యానువల్ కారు నడపాలని డాక్టర్లు కేసీఆర్కు సూచించారు. దీంతో కేసీఆర్ ఓమ్నీ వాహనాన్ని నడిపారు.
KCR: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓమ్నీ వ్యాన్ నడిపారు. గతేడాది ఆపరేషన్ అయిన ఆయన ప్రస్తుతం కర్ర సాయం లేకుండా నడుస్తున్నారు. ఈ క్రమంలో మ్యానువల్ కారు నడపాలని డాక్టర్లు కేసీఆర్కు సూచించారు. దీంతో కేసీఆర్ ఓమ్నీ వాహనాన్ని నడిపారు. ఈ ఫొటోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా.. నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతోంది. సారు.. మళ్లీ కారు నడుపుతున్నారని బీఆర్ఎస్ నేతలు, అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మాజీ సీఎం కేసీఆర్ గతేడాది తన ఇంట్లో కాలు జారిపడ్డారు. ప్రమాదానికి గురైన తర్వాత వైద్యులు కేసీఆర్కు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆ తర్వాత కేసీఆర్ వాకర్ సాయంతో నడిచారు. సర్జరీ తర్వాత కొన్ని రోజులు ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత కొన్ని రోజులకు చేతి కర్ర సాయంతో నడిచారు. ఇప్పుడు పూర్తిగా కోల్కోని వైద్యుల సూచన మేరకు ఓమ్నీ వాహనం నడిపారు.