రీసెంట్గా కన్నడ స్టార్ హీరో(kannada Hero) ఉపేంద్ర(Upendra) చేసిన వ్యాఖ్యలు వివాదం అయిన సంగతి తెలిసిందే. ఉపేంద్ర చేసిన కామెంట్స్ కన్నడలో కొన్ని వర్గాల వారిని ఉద్దేశించి ఉండడంతో.. పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. దాంతో ఇప్పుడు ఉన్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయించాడు ఉపేంద్ర.
కన్నడ హీరో(kannada Hero) ఉపేంద్ర(Upendra) గురించి అందరికీ తెలుసు. కన్నడతో పాటు తెలుగులోను ఉపేంద్ర అందరికీ సుపరిచితుడే. ఇటీవలె కబ్జా అనే పాన్ ఇండియా సినిమాతో ఆడియెన్స్ ముందుకొచ్చాడు ఉపేంద్ర. ప్రస్తుతం కొన్ని భారీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్నాడు. అయితే రీసెంట్గా ఈ స్టార్ హీరో చేసిన కొన్ని వ్యాఖ్యలు వివదానికి దారి తీశాయి. ఇప్పటికే ఉపేంద్ర ప్రజాక్రియా అనే రాజకీయ పార్టీని స్థాపించాడు. రీసెంట్గా ఈ పార్టీ వార్షికోత్సవం సందర్భంగా ఉపేంద్ర ఫేస్ బుక్ లైవ్‌లో తన పార్టీ సభ్యులతో పాటు.. అభిమానులతో కూడా మాట్లాడాడు. అందులో విపక్షాలపై విమర్శలు గుప్పించాడు. ఈ క్రమంలో.. ఓ ఊరు ఉందంటే అక్కడ కచ్చితంగా దళితులు ఉంటారు. అలానే మంచి చేసే ఆలోచన ఉన్నప్పుడు విమర్శలు చేసేవాళ్లు ఉంటారని నోరు జారాడు. దీనికి ఓ సామెత కూడా వాడాడు. అది దళితులను కించపరిచేలా ఉందంటూ చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ దళిత సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి. ధర్నాలు, రాస్తారోకోలు చేశాయి.
బెంగళూరు, మండ్య, కోలారులో ఆయనపై ఎస్సీ, ఎస్టీ కేసులు కూడా నమోదు అయ్యాయి. ఇక వివాదం మరింత ముదురుతుందని ఊహించిన ఉపేంద్ర.. చివరికి క్షమాపణలు చెప్పాడు. అయినప్పటికీ వివాదం సద్దుమణగలేదు. కన్నడ న్యాయస్థానం స్టే ఇచ్చినప్పటికీ.. హలసూరు గేట్ ఠాణాతో పాటు ఇతర ప్రాంతాల్లోని కొన్ని ఠాణాల్లో దళిత సంఘాలకు చెందిన నేతలు ఉపేంద్రపై కేసులు పెట్టారు. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో ఉపేంద్ర అజ్ఞాతంలోనే ఉన్నారు. సదాశివనగర, కత్రిగుప్పెలోని ఆయన నివాసాల వద్ద పోలీసు(police) భద్రత కూడా కల్పించారు. ఇక తాజాగా ఉపేంద్ర తరఫున న్యాయవాది ఉదయ్ హొళ్ల కోర్టును ఆశ్రయించారు. ఉపేంద్ర తనపై వివిధ చోట్ల నమోదైన ఎఫ్ఐఆర్(FIR)లను రద్దు చేయాలని ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరి ఉపేంద్ర ఈ వివాదం నుంచి ఎలా బయటపడతాడో చూడాలి.