దివంగత నటి శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది జాన్వీ. ఆమె బాలీవుడ్ లో తెరంగేట్రం చేసి దాదాపు ఐదు సంవత్సరాలు అవుతున్నా, చెప్పుకోతగిన హిట్ మాత్రం ఆమెకు దక్కలేదు. దీంతో తన దృష్టి దక్షిణాదిపై పెట్టింది. సౌత్ లో తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి కసరత్తులు మొదలుపెట్టింది.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ఇప్పటికే టాలీవుడ్ లో ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేసింది. ఈ దేవర మూవీ కనుక హిట్ అయితే, తెలుగులో జాన్వీకి ఆఫర్లు క్యూలు కట్టే అవకాశం లేకపోలేదు. ఈ మూవీకి ముందే ఆమెకు ఆఫర్లు వస్తున్నా, ఆచితూచి అడుగులు వేయాలి అనే ఉద్దేశంతో తొందరపడి ఎలాంటి ఆఫర్లు ఒకే చేయడం లేదు. ఈ మూవీ రిజల్ట్ తర్వాతే తెలుగులో కొత్త సినిమా అంగీకరించాలని అనుకుంటోందట. కాగా, జాన్వీ షూటింగ్స్ లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం చాలా చురుకుగా ఉంటుంది. తరచూ తన ఫ్యాన్స్ కి తన అందాలతో ట్రీట్ ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా ఈ బ్యూటీ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బ్లాక్ కలర్ డ్రెస్ లో మెరిసింది. ఈ టైట్ ఫిట్ డ్రెస్ లో వయ్యారాలు పోతూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడం విశేషం.
ఇప్పుడు ఈ ఫోటోలు ఆమె అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, ఆమె ఫోటోలకు జాన్వీ ఫ్రెండ్ శిఖర్ పెహారియా స్పందించాడు. జాన్వీ ఫోటోకి కింద హార్ట్ సింబల్ ని కామెంట్ చేయడం విశేషం. దీంతో, మరోసారి వారిద్దరి మధ్య ఏదో ఉంది అంటూ ప్రచారం మొదలైంది. శిఖర్ గతంలోనూ జాన్వీ ఫోటోలకు కామెంట్(comment) చేయడం విశేషం. ఇదిలా ఉండగా మరో వైపు ఈ బ్యూటీ తమిళంలోనూ అడుగుపెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఓ సినిమా ఒకే అయినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. బ్యాలెన్స్డ్ గా అటు తెలుగులోనూ, ఇటు తమిళంలోనూ తన కెరీర్ ని కంటిన్యూ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వరసగా రెండు హిట్లు పడితే, ఇక దక్షిణాదిన జాన్వీ కెరీర్ కి ఎలాంటి డోకా లేదనే చెప్పొచ్చు.