»Vijay Devarakonda On Baby Will Talk After Four Days
Vijay Devarakonda: బేబి పై విజయ్ దేవరకొండ కామెంట్..!
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్ అశ్విన్ నటించిన బేబీ ప్రీమియర్లు నిన్న రాత్రి ప్రదర్శించారు. ప్రసాద్స్ మల్టీప్లెక్స్‌లో జరిగిన “బేబీ” సినిమా స్పెషల్ ప్రీమియర్ షోకి స్టార్ హీరో విజయ్ దేవరకొండ రావడం అందరి దృష్టిని ఆకర్షించింది.
రౌడీ హీరో విజయ్ దేవర కొండ(Vijay Devarakonda) తమ్ముడిగా ఇండస్ట్రీలోకి రంగ ప్రవేశం చేశాడు ఆనంద్ దేవర కొండ. తాజాగా ఆయన బేబి మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వైష్ణవి చైతన్య కథనాయికగా నటించిన ఈ సినిమాలో, విరాజ్ అశ్విన్ కీలకమైన పాత్రను పోషించాడు. కాగా ఈ మూవీ ప్రీమియర్స్ షో వేయగా, దానిని విజయ్ దేవర కొండ వచ్చి మరీ వీక్షించారు. ప్రీమియర్స్ తర్వాత తన సోదరుడిపై విజయ్ మాట్లాడతాడు అని అందరూ అనుకున్నారు. కానీ, ఆయన ఏమీ మాట్లాడకపోవడం విశేషం.
బేబీ(Baby the movie) సినిమా గురించి నేను ఎక్కువగా మాట్లాడదలచుకోలేదు. ముందుగా, ప్రీమియర్‌ని చూడటానికి ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. సినిమా లోపల ఆనంద్, విరాజ్, వైష్ణవి సహా అందరూ నన్ను ఎమోషనల్ చేసి ఏడిపించారని సినిమా చూసిన తర్వాత విజయ్ దేవర కొండ అన్నారు. దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్కెఎన్, బేబీ ఇతర సిబ్బందిని చూసి గర్వపడుతున్నానని విజయ్ చెప్పారు. అయితే 3-4 రోజుల తర్వాత మరో ఈవెంట్లో సినిమా గురించి మాట్లాడతానని స్పష్టం చేశారు. అలాగే విజయ్ దేవర కొండ బేబీ టీమ్ పట్ల తనకున్న ప్రేమను ట్విట్టర్ లో తెలియజేశారు. ట్విట్టర్ లో ఈ మూవీ చాలా అద్భుతంగా ఉంది అని విజయ్ పేర్కొనడం విశేషం. ఇక, ఈ మూవీ పై పాజిటివ్ మిశ్రమ రివ్యూలు వస్తున్నాయి.