World cup: ఇండియాకు అన్యాయం..ICCపై అభిమానుల మండిపాటు
వరల్డ్ కప్ షెడ్యుల్ పై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. రెండు మూడు రోజులు వ్యవదిలోనే టీమ్ ఇండియా వేల కిలోమీటర్ల ప్రయాణించాల్సి ఉందని అంటున్నారు. స్వదేశంలోనే మ్యాచ్ లు జరుగుతున్నా ఇలా షెడ్యుల్ చేసిన ఐసీసీ తీరుపై క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
World cup: క్రికెట్ (Cricket) అభిమానులు ఎంతగానో ఎదురుచేస్తోన్న తరుణం ఎంతో దూరంలో లేదు. మరికొద్ది రోజుల్లో క్రికెట్ వరల్డ్ కప్(World cup) ప్రారంభం కానుంది. వరల్డ్ కప్ కు సంబంధించిన షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో అన్ని దేశాల టీంలు తమ వ్యూహాలను రచిస్తున్నాయి. 2023 వరల్డ్ కప్ విషయంలో టీమ్ ఇండియాకు(Indian Team) కలిసొచ్చే విషయం ఏంటంటే ఈ సారి వరల్డ్ కప్ మన దేశంలోనే జరగుతుంది. దీనిలో భాగంగా వరల్డ్ కప్ టోర్నీ కోసం మొత్తం 10 వేదికలను బీసీసీఐ(BCCI) సెలెక్ట్ చేసింది. మరీ ఈ స్టేడియాల్లో వరల్డ్ కప్ లో పాల్గొనే జట్లు రెండు మ్యాచ్ లు ఆడనున్నాయి. అయితే ఈ వరల్డ్ కప్ మన దేశంలోనే జరుగుతున్నప్పటికీ ఐసీసీ(ICC) మాత్రం భారత్ జట్టుకు అన్యాయం చేసిందని అంటున్నారు. టీమ్ ఇండియా ఆడబోయే 9 మ్యాచులు 9 వేర్వేరు వేదికల్లో నిర్వహిస్తున్నారు.
భారత జట్టు మాత్రమే ఇన్ని స్టేడియాల మధ్య ప్రయాణిస్తూ మ్యాచ్‌లు ఆడనుంది. భారత ప్లేయర్లు లీగ్ మ్యాచ్‌ల కోసం ఏకంగా 8,400 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పరిస్థితి ఉందని తెలుస్తోంది. వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్(New Zealand) తో జరుగుతున్న మ్యాచ్ కు ముందు టీమ్ ఇండియా వేల కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. అన్ని కిలోమీటర్లు ప్రయాణించి న్యూజిలాండ్(New Zealand)తో ఆడటం అంటే అది మాములు విషయం కాదని క్రికెట్ అభిమానులు భావిస్తున్నారు. కేవలం మూడు రోజుల గ్యాప్‌లో ఇండియా క్రికెట్ టీమ్ వేల కిలోమీటర్లు జర్నీ చేసేలా ఐసీసీ షెడ్యూల్ విడుదల చేయడంతో భారత క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈ లీగ్ లో ఆడే కొన్ని టీమ్ లు ఒకే నగరంలో వారం రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఆయా టీమ్ లు హాయిగా విశ్రాంతి తీసుకుంటాయి. అంతే కాకుండా పిచ్ పరిస్థితిని కూడా పూర్తి స్థాయిలో అంచనా వేసుకొని అద్భుతంగా ఆడే అవకాశం ఉంది. ఇక టీమ్ ఇండియా విషయానికి వస్తే ఒక్క హైదరాబాద్‌లో తప్ప మిగతా అన్ని వేదికల్లో మ్యాచులు ఆడనుంది. ఇక వార్మప్ మ్యాచ్‌లని(Warmup matches) గువాహతి, త్రివేండ్రంలో ఆడనుంది. వరల్డ్ కప్ టోర్నీలో టీమ్ ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఆస్ట్రేలియాతో(Australia) చెన్నై స్టేడియంలో ఆడీ… అక్కడి నుంచి రెండో మ్యాచ్ కోసం ఢిల్లీ వెళ్లాలి. అంటే టీమ్ ఇండియా రెండో మ్యాచ్ ఆడటానికి ఏకంగా 1,761 కిలోమీటర్లు ప్రయాణించాల్సి పరిస్థితి ఉంది. అంతే కాదు ఈ మ్యాచ్ ముగిసిన వెంటనే మళ్లీ పూణేలో బంగ్లాదేశ్‌తో ఆడాలి. అక్కడి నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలకు(Dharamshala) వెళ్లి అక్కడ న్యూజిలాండ్ టీమ్ తో తలపడాలి. అంటే ఈ రెండు మ్యాచ్ ల మధ్య కేవలం రెండు రోజుల వ్యవధి మాత్రమే ఉండటం, వేల కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి రావడంతో టీమ్ ఇండియా ఆటగాళ్లు అలిసిపోతారేమో అని క్రికెట్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.