»India Australia Match In Visakhapatnam On March 19 Online Tickets For March 10
Visakhapatnam:లో మార్చి 19న భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్..మార్చి 10 నుంచి టిక్కెట్స్
ఏపీలోని విశాఖలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మార్చి 19న రెండో వన్డే ఇంటర్నేషనల్ (ODI) మ్యాచ్ జరగనుంది. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు ఏసీఏ(ACA) అధికారులు తెలిపారు. మరోవైపు ఆన్ లైన్లో మార్చి 10 నుంచి, ఆఫ్ లైన్ విధానంలో మార్చి 13 నుంచి పలు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు టిక్కెట్లు(tickets) అందుబాటులో ఉంటాయన్నారు.
టీమిండియా, ఆస్ట్రేలియా(India Australia) మధ్య మార్చి 19న జరగాల్సిన వన్డే ఇంటర్నేషనల్ (Oneday International) మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి ఏపీ(ap)లోని విశాఖ నగరం(Visakhapatnam city) సిద్ధమవుతోంది. చివరి ODI మ్యాచ్‌లాగా Dr YSR Aca VDCA స్టేడియం నాలుగు సంవత్సరాల తర్వాత ODI మ్యాచ్‌కు మళ్లీ ఆతిథ్యం ఇవ్వనుంది. 2019 సంవత్సరంలో భారత్, వెస్టిండీస్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది.
మ్యాచ్‌కు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) కార్యదర్శి వి.గోపీనాథ్ రెడ్డి(gopinath reddy) తెలిపారు. మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం కానుంది. ప్రవేశ ద్వారాలు 11.30 గంటల నుంచి క్రీడాభిమానుల కోసం అందుబాటులో తెరవబడతాయని, మధ్యాహ్నం 3.30 గంటలకు మూసివేయబడతాయని ప్రకటించారు.
ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని టిక్కెట్ల ధరలను పెంచకూడదని ACA నిర్ణయించినట్లు గోపీనాథ్ రెడ్డి తెలిపారు. ఈ క్రమంలో టిక్కెట్ల రేట్లు రూ.600, రూ.1,500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ. 6,000 పరిధిలో ఉంటాయన్నారు. టిక్కెట్లు(tickets) ఆన్ లైన్లో(online) మార్చి 10 నుంచి, ఆఫ్ లైన్(offline) విధానంలో మార్చి 13 నుంచి పలు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విక్రయించనున్నట్లు చెప్పారు. అయితే టిక్కెట్ కేంద్రాలను త్వరలో ప్రకటిస్తామన్నారు. టిక్కెట్లు(tickets) ప్రాంగణంలో ప్రవేశం, సీటింగ్, వ్యవస్థీకృత కదలికల సౌలభ్యం కోసం బార్-కోడ్ చేయబడ్డాయని ఆయన అన్నారు.
అలాగే పలు ప్రాంతాల్లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు ఏసీఏ అధికారులు(officers) తెలిపారు. స్టేడియం(stadium) లోపల తాగునీరు ఉచితంగా అందుబాటులో ఉంటుందన్నారు. ప్రజల సౌకర్యార్థం క్రింది వేదికల వద్ద తగినంత పార్కింగ్ సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రేక్షకుల కోసం అంబులెన్స్‌లు, ప్రత్యేక వైద్యులతో పాటు నిర్దేశిత ప్రాంతాల్లో వైద్య బృందాలు కూడా ఉంటాయన్నారు. ఇక ప్రవేశ ద్వారం వద్ద ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు బారికేడింగ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇక భారత్-ఆస్ట్రేలియా(India -Australia) మధ్య తొలి వన్డే మ్యాచ్ మార్చి 17న మహారాష్ట్రలోని ముంబయి(mumbai)లో జరగనుంది.