భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt)విద్యాసంస్థలకు సెలవులు పొడగించింది. ఇవాళ, రేపు సెలవులని ఉదయం ప్రకటించగా.. తాజాగా శనివారం. వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. GHMC పరిధిలో పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలకూ సెలవులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను సీఎం కేసీఆర్(CM KCR) ఆదేశించారు.హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తుండడంతో జీహెచ్ఎంసీ (GHMC) అలర్ట్ అయింది.
లోతట్టు ప్రాంతాల్లో ఎన్డీఆర్ఎఫ్ (NDRF) టీంలను సిద్ధం చేశారు. శిథిలావస్థ భవనాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. నాలా పనులు పూర్తి కాని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. వాటర్ లాగింగ్ ప్రాంతాల్లో 24 గంటల పాటు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సహాయ కేంద్రాల కోసం కంట్రోల్ రూంలు ఏర్పాటు చేస్తున్నారు. హెలికాప్టర్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని విజ్ఞప్తి చేశారు.