ఇరాన్ దేశంలో భారీ భూకంపం సంభవించింది. భారీ భూకంపానికి ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో భవనాలు, ఇండ్లు, పలు ప్రభుత్వ కట్టడాలు నేలమట్టం అయ్యాయి. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 440 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.9గా నమోదైందని అధికారులు వెల్లడించారు.
భూకంపం వల్ల ఖోయ్, అజర్ బైజాన్ ప్రావిన్స్ లోని పలు భవనాలు కూలిపోయాయి. ఇరాన్ లోని పలు ప్రాంతాల్లో సహాయక బృందాలు క్షతగాత్రులను కాపాడి, ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద చిక్కుకుని ఉన్న మరికొందరిని కూడా తరలిస్తున్నారు. భూకంపం సంభవించిన ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. బాధితులు ఆర్తనాదాలు చేస్తుండడం అందర్నీ కలచివేసింది. ఆయా ప్రాంతాల్లో పొగమంచు కూడా అధికంగా ఉందని, విద్యుత్తు సరఫరా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇరాన్ లో తరచూ భూకంపాలు సంభవిస్తూ వస్తున్నాయి.