mp arvind:సీఎం కేసీఆర్‌కు (cm kcr) అంత డబ్బు ఎక్కడిది అని ధర్మపురి అర్వింద్ (mp arvind) ప్రశ్నించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విపక్షాలకు నాయకత్వం వహిస్తానని కేసీఆర్ (kcr) అన్నారు. దీంతో ఈ అంశం చర్చకు వచ్చింది. అర్వింద్ (arvind).. సీఎం కేసీఆర్‌కు (kcr) సూటిగా ప్రశ్నలు సంధించారు. లక్షల కోట్లను ఆయన ఎలా సంపాదించారని అడిగారు.
కేసీఆర్ (kcr) వద్ద ఉన్న డబ్బుల (money) గురించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుందని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో డబ్బులు వెదజల్లేందుకు కేసీఆర్ (kcr) సిద్దమవుతున్నారని ఆరోపించారు. బీజేపీ నేతలను (bjp leaders) బెదిరించి ప్రభుత్వం నడుపతామంటే ఊరుకోబోయేది లేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ (delhi liquor scam) విచారణ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉందన్నారు.
ఈ నెల 8వ తేదీన రాష్ట్రంలో ప్రధాని మోడీ (modi) పర్యటన ఉన్న సంగతి తెలిసిందే. అరెస్ట్ చేసి భయపెడదామని చూస్తోందా అని అడిగారు. హైదరాబాద్‌లో ఉన్న తన ఇంటికి పోలీసులు వచ్చారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీ (emergency) తరహా వాతావరణం సృష్టిస్తున్నారని మండిపడ్డారు.
బండి సంజయ్ (bandi sanjay) అరెస్ట్ చేయడం అందుకు ఉదహరణ అని చెప్పారు. నిన్న రాత్రి బండి సంజయ్‌ను పదో తరగతి హిందీ పేపర్ లీక్ (hindi paper leak) కేసులో పోలీసులు (police) అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆయనను ఏ1గా చేర్చారు.