»High Court Notice To Trs Mla Arekapudi Gandhi And Telangana Police
BRS ఎమ్మెల్యేకు గట్టి షాక్..హైకోర్టు నోటీసులు
తెలంగాణలోని శేరిలింగంపల్లి BRS ఎమ్మెల్యే అరికపూడి గాంధీ(arekapudi gandhi)కి గట్టి షాక్ తగిలింది. అరికపూడితోపాటు పోలీసులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే ఓ ల్యాండ్ వివాదం కేసులో ఈ మేరకు ధర్మాసనం నోటీసులు పంపించింది.
రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి BRS ఎమ్మెల్యే(serilingampally mla) అరికపూడి గాంధీ(arekapudi gandhi)కి తెలంగాణ హైకోర్టు(telangana high court)నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ఓ భూ వివాదం కేసులో ఈ ఎమ్మెల్యేతోపాటు పోలీసులకు కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ వివాదం కేసులో ఫెనీస్ట్రేషన్ సిస్టమ్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థపై 100 మందితో దాడి చేశారని, కోట్ల విలువైన సామాగ్రి ధ్వంసం చేశారని బాధితులు హైకోర్టులో పిటిషన్ వేశారు. అంతేకాదు అజయ్ అగర్వాల్, సులోచన అగర్వాల్ ఈ వివాదం గురించి పోలీసులకు తెలిపినా కూడా ఫిర్యాదు తీసుకోలేదని, కేసు నమోదు చేయలేదని పేర్కొన్నారు. అనేక సార్లు అడిగిన తర్వాత వారం రోజులకు కేసు నమోదు చేశారని బాధితులు వాపోయారు.
దీనిపై స్పందించిన హైకోర్టు(high court) ఎమ్మెల్యే, పోలీసులకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఈ దాడి ఘటనపై వెంటనే నివేదిక ఇవ్వాలని ఇన్ స్పెక్టర్ ప్రశాంత్, ఎస్ఐ మల్లేశ్వర్ లను హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు ఎమ్మెల్యే అరికపూడి గాంధీకి వ్యక్తిగతంగా నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 10కి వాయిదా వేసింది.