»Heavy Rains In Telangana For Two Days Red Alert For Warangal District
Telangana:లో 3 రోజులు భారీ వర్షాలు…ఈ జిల్లాకు రెడ్ అలర్ట్
తెలంగాణ(telangana)లోని పలు జిల్లాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని రానున్న 3 రోజులు ఇవి కొనసాగుతాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు రెడ్ అలర్ట్(red alert) జారీ చేశారు.
తెలంగాణ(telangana)లో విరామం ఇచ్చిన వర్షాలు మళ్లీ ఊపందుకున్నాయి. అయితే మంగళవారం కూడా భారీ వర్షాలు(rains) కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా(warangal)కు రెడ్ అలర్ట్(red alert) ప్రకటించింది. ఈ క్రమంలో ఈ జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలకు పునరావాసం కల్పించాలని, ప్రజలకు రేషన్ సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు సూచించారు. గర్భిణులు ఆసుపత్రి దగ్గర ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం జిల్లా అధికారులను అప్రమత్తం చేసింది.
ఇప్పటికే కురిసిన వర్షాల(rains)తో ఉమ్మడి జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చిన్న నీటి వనరులైన చెరువులు, కుంటలు పలుచోట్ల పొంగిపొర్లుతున్నాయి. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో వాహనదారులు రోడ్లపై ఉన్న కల్వర్టులను దాటే సాహసం చేయకూడదని కోరారు. చేపల వేటకు వెళ్లడం మానుకోవాలని సూచించారు. చెరువులు, ఆనకట్టలు బలహీనంగా ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ప్రమాదకర ప్రాంతాల్లో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు.
విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు(farmers) తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ అధికారులు అన్నారు. పత్తి, కంది, మొక్కజొన్న, పెసర, మినుము, వరి, మిరప వంటి ఎండు పంటలు సాగు చేసే పొలాల్లో నీరు చేరకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. నీరు నిలిచిన తేమతో కూడిన పంటలలో ఎరువులు వేయవద్దని, అలా చేస్తే చిన్న మొక్కలు చనిపోయే ప్రమాదం ఉందని వెల్లడించారు.
మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు, జనగామ, ములుగు జిల్లాల్లో అతిభారీ, భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. 80 నుంచి 100 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. గంటకు 30 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులతో భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది. కూలిపోయే దశలో ఉన్న ఇళ్ల(houses)లో ఎవరూ ఉండకూడదని అన్నారు.