డబ్బు ఉంటే ఏదైనా చేయచ్చు అనే భావనతో బీఆర్ఎస్ నాయకులు వ్యవహరిస్తున్నారని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. బోనం ఎత్తుకొని ఎదురెల్లితే, బతుకమ్మ ఆడితే డబ్బులు ఇస్తారు అని డప్పు చాటింపు వేయడంపై రేవంత్ రెడ్డి మండి పడ్డారు.
Revanth Reddy: బీఆర్ఎస్ నాయకులు భావోద్వేగాలకు వెల కడుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy ) ఆగ్రహం వ్యక్తం చేశారు. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి (( Marri Janardhan Reddy) నియోజక వర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. గ్రామాల్లో బోనం ఎత్తుకొని, బతుకమ్మతో ఎదురొస్తే డబ్బులిస్తామని చాటింపు చేయడం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దీంతో రేవంత్ రెడ్డి (Revanth Reddy ) సదరు ఎమ్మెల్యేపై మండి పడ్డారు. బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవం.. తెలంగాణ సంస్కృతికి సంకేతం. అలాంటి ఆత్మగౌరవానికి వెలకట్టడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి నిదర్శనం. ఇది తెలంగాణ సంస్కృతి విధ్వంసం. బీఆర్ఎస్ పతనానికి సంకేతం అని ట్వీట్ చేశారు. గ్రామాల్లో చాటింపు చేస్తున్న వీడియోను, ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని షేర్ చేశారు.
చదవండి:YS Sharmila: KCRకు కౌంట్ డౌన్ స్టార్ అయ్యింది
ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి( Marri Janardhan Reddy) నాగర్కర్నూల్ నియోజిక వర్గంలో పాదయాత్ర చేస్తున్నాడు. ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. తనను కెలకొద్దని, తనకు పిచ్చి లేస్తే కాంగ్రెస్ వాళ్లను కాల్చిపడేస్తానని అనడంతో ఆ మాటలు వైరల్ అయ్యాయి. తన క్యాడర్ తలుచుకుంటే కాంగ్రెస్ నేతలు ఒక్కరు కూడా గ్రామాల్లో తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. పాదయాత్ర చేస్తున్న గ్రామాల్లో ముందురోజు.. మర్రి జనార్దన్ రెడ్డి మూడింటికి మన ఊర్లోకి వస్తున్నారు. బోనం ఎత్తుకుని వస్తే రూ.300, బతుకమ్మతో వస్తే రూ.200, ఎవరైనా డ్యాన్స్ చేస్తే ఒక ఫుల్ బీర్ ఇస్తారు అని చాటింపు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తేగ వైరల్ అవుతుంది. దీనిపై పలువురు కాంగ్రెస్ నేతలు విమర్షిస్తున్నారు.
🔥బోనం ఎత్తడం ఆడబిడ్డల ఆత్మగౌరవం. తెలంగాణ సంస్కృతికి సంకేతం.
🔥అలాంటి ఆత్మగౌరవానికి వెలకట్టడం బీఆర్ఎస్ నేతల అహంకారానికి పరాకాష్ఠ. ఇది తెలంగాణ సంస్కృతి విధ్వంసం. బీఆర్ఎస్ పతనానికి సంకేతం.#ByeByeKCRpic.twitter.com/UbQq98hHl4