బేబీ సినిమా హీరోయిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కన్నీళ్లు పెట్టుకుంది. యూట్యూబ్ నుంచి వచ్చన తాను వెండితెర మీద చూసుకోవడానికి చాలా కష్టాలు పడ్డట్లు తెలిపింది.
Heroine Vaishnavi Chaitanya cried at the baby pre-release event.
Baby: యూట్యూబ్ వెబ్ సిరీస్ల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన హీరోయిన్ వైష్ణవి చైతన్య తాజాగా ఆనంద్ దేవరకొండ హీరోగా, సాయిరాజేష్ దర్శకత్వం వహిస్తున్న బేబీ సినిమాలో నటిస్తోంది. జూలై 14 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధవారం జరుపుకుంది. ఈ వేడుకలో వైష్ణవి చాలా ఎమోషనల్ అయింది. చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ.. వచ్చిన ప్రతీ అవకాశాన్ని కళ్లకు అద్దుకొని చేస్తున్న సమయంలో ఊహించన విధంగా బేబీ సినిమా తన లైఫ్ లోకి వచ్చిందని, పూర్తి నమ్మకంతో డైరెక్టర్ సాయి రాజేష్ తనను నమ్మారని తెలిపింది.
యూట్యూబ్లో క్యారెక్టర్లు చేసుకునే అమ్మాయి అని చులకనగా చూసిన చాలా సందర్భాలను ఆమె చూసినట్లు తెలిపింది. అందుకే తనకు సినిమా అవకాశం వచ్చినప్పుడు చేయగలనా అనే డౌట్ వచ్చందని, కానీ దర్శకుడు సాయి రాజేష్ ఇచ్చిన ధైర్యంతో సినిమా చేసినట్లు చెప్పింది. అమ్మనాన్న ఇచ్చింది ఫస్ట్ లైఫ్ అయితే సెకండ్ లైఫ్ ఇచ్చింది డైరెక్టర్ అంటూ ఎమోషనల్ అయింది. షూటింగ్ మొదలు పెట్టిన 3 సంవత్సరాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడ్డట్టు చెప్పుకొచ్చింది. అలాగే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ కూడా తనకు ఎంత సపోర్ట్ చేశారో చెబుతూ ఎడ్చేసింది. బేబీ సినిమా వాస్తవ కథల ఆధారంగా తెరకెక్కింది. నిజ జీవితంలో మనకు లేదా పక్కవారికి జరిగిన సంఘటనలను తెరమీద చూసినట్లు ఉంటుంది. మూవీ చూసీ బయటకు వచ్చేప్పుడు కచ్చితంగా అందరి హృదయాలు బరువెక్కుతాయి అని వైష్ణవి చైతన్య తెలిపింది. ఇది కచ్చితంగా అందరికి కనెక్ట్ అయ్యే చిత్రం అని ఏదో ఒక పాయింట్ దగ్గర మీరు సినిమాతో లవ్ లో పడిపోతారు అని పేర్కొంది.