»Hero Vishal Clarity On The News Of Marriage With The Heroine Lakshmi Menon
Vishal: హీరోయిన్ తో పెళ్లి వార్తలపై..హీరో విశాల్ క్లారిటీ
తమిళ్ స్టార్ హీరో..హీరోయిన్ లక్ష్మీ మీనన్(lakshmi menon)తో ప్రేమలో ఉన్నారని, పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పుకార్లు వచ్చాయి. అయితే ఈ అంశంపై హీరో విశాల్(vishal) ట్విట్టర్ వేదికగా స్పందించారు. అయితే ఏం చెప్పారో ఇప్పుడు చుద్దాం.
Hero Vishal Clarity on the news of marriage with the heroine lakshmi menon
ఇండస్ట్రీలో చాలా కాలంగా బ్యాచిలర్స్‌గా కొనసాగుతున్న హీరోలకు సంబంధించి ఎప్పటికప్పుడు ఏదైనా వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. గత కొన్ని రోజులుగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలో హీరో విశాల్(vishal) పెళ్లికి సంబంధించి కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. గతంలో విశాల్‌తో కలిసి నటించిన తమిళ హీరోయిన్ లక్ష్మీ మీనన్‌ని పెళ్లి చేసుకోబోతున్నాడని సోషల్ మీడియాలో అన్ని చోట్లా ట్రెండ్ అయింది. కొన్నాళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ మీనన్‌తో పెళ్లి వార్తలపై విశాల్ ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చాడు.
ఈ వార్తలపై ట్విటర్లో స్పందిస్తూ.. అసలు విషయం చెప్పాడు. దీంతో విశాల్ ట్వీట్ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అయితే విశాల్ రియాక్షన్ ఏంటంటే.. ‘‘సాధారణంగా నా పెళ్లిపై వస్తున్న పుకార్లను నేను పెద్దగా పట్టించుకోను. అనవసరమైన రూమర్స్ అని వదిలేస్తాను. కానీ ఈసారి మాత్రం క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. హీరోయిన్ లక్ష్మీ మీనన్(heroine lakshmi menon)తో నా పెళ్లిపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఈ వార్తను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. హీరోయిన్ కంటే ముందు లక్ష్మీ మీనన్ నటి అని మీరు గ్రహించాలి. ఆమె వ్యక్తిగత జీవితాన్ని, ఇమేజ్ను దెబ్బతీసేలా ఇలాంటి వార్తలు ప్రచారం చేయోద్దని కోరారు.
అంతేకాదు విశాల్ తన పెళ్లి(marriage) ఎప్పుడు అనే విషయంపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను అనేది అవసరమైన అంశం కాదు. సమయం వచ్చినప్పుడు అదే జరుగుతుంది. జరిగేదాన్ని ఎవరూ ఆపలేరు. మీరు త్వరలో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. మీ అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని సూటిగా స్పష్టం చేశారు. దీంతో విశాల్, లక్ష్మీ మీనన్ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది. అయితే.. విశాల్, లక్ష్మీ మీనన్ జంటగా పల్నాడు, ఇంద్రుడు చిత్రాల్లో యాక్ట్ చేశారు. ప్రస్తుతం విశాల్.. మార్క్ ఆంటోని సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు.
Usually I don’t respond to any fake news or rumors about me coz I feel it’s useless. But now since the rumour about my marriage with Laksmi Menon is doing the rounds, I point blankly deny this and it’s absolutely not true and baseless.