ఈ జనరేషన్ హీరోల్లో అడివి శేష్(Adivi Sesh) రూటే సపరేటు. ఏ సినిమా చేసిన మినిమం గ్యారెంటీ హీరోగా శేష్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు అడివి శేష్ చేసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అయితే ఒక్క హీరోగానే కాదు.. రైటర్‌గా తన మార్క్ చూపిస్తున్నాడు ఈ యంగ్ హీరో. అందుకే తనకు తానే పుడింగిలా ఫీల్ అవుతున్నాడట. కానీ బిచ్చగాడు హీరోని చూశాక భయపడ్డానని కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు శేష్.
2016లో విజయ్ ఆంటోని హీరోగా వచ్చిన బిచ్చగాడు సినిమా.. అప్పట్లో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాంతో చాలా కాలం తర్వాత బిచ్చగాడు 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు విజయ్ ఆంటోని. మే 19న ఈ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే విజయ్ ఆంటోని జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నాడు. రీసెంట్గా రిలీజ్ చేసిన ‘బిచ్చగాడు 2(bichagadu 2)’ స్నీక్ పీక్ సినిమా పై అంచనాలను పెంచేస్తోంది. అలాగే ఈవెంట్స్‌తో మరింత హైప్ క్రియేట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో హైదరాబాద్‌లో మంగళవారం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు ఊహించని విధంగా అడివి శేష్(Adivi Sesh) ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా శేష్ మాట్లాడుతూ.. తనను తాను పుడింగిలా ఫీలయ్యేవాడినని.. తనపై తానే సెటైర్స్ వేసుకున్నాడు. ‘ఒరిజినల్‌గా మనమే కథలు రాసుకుంటున్నాం, మనమే యాక్టింగ్ చేసుకుంటున్నాం కాబట్టి.. పెద్ద పుడింగిలా ఫీలయ్యాను.
కానీ విజయ్(vijay antony) గారి నుంచి ఫోన్ వచ్చినపుడు భయపడ్డాను. జస్ట్ మనం రైటింగ్, యాక్టింగ్ మాత్రమే చేస్తున్నాం. కానీ విజయ్ ఆంటోని యాక్టింగ్, డైరెక్షన్, మ్యూజిక్, ప్రొడ్యూసింగ్ కూడా చేస్తున్నారు. దాంతో ఆయన నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకున్నాను. అందుకే బిచ్చగాడు2 ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రమ్మనగానే వచ్చేశాను.
ఆయన మాట్లాడిన 5 నిమిషాల్లోనే నాకు ఎంతో ప్యాషన్ కనిపించింది. ఆయన ఇక్కడే కాదు బెంగళూరు, కేరళ, మలేషియా, సింగపూర్ లాంటి సిటీస్‌లో అన్నీ బిగ్ ఈవెంట్స్ చేస్తున్నారు. వారికి మంచి జరగాలని కోరుకుంటున్నాని.. అన్నాడు.
అలాగే.. ఫాతిమా గారు, విజయ్ గారు జెన్యూన్‌గా ఈ సినిమా(movie)కు ప్రాణం పెట్టారు. మే 19న అందరం థియేటర్స్‌లో కలుద్దాం.. అంటూ చెప్పుకొచ్చాడు అడివి శేష్. ఏదేమైనా అడివి శేష్.. తాను పుడింగిని కాదని చెప్పిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి.
ఇది కూడా చూడండి:Kriti Shetty : నాకు అలాంటి భర్త కావాలి : కృతిశెట్టి