»Governor Tamilisai Said To Report On Tspsc Question Paper Leakage Within 48 Hours
Governor Tamilisai: TSPSC ప్రశ్నాపత్రం లీకేజీపై 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి
TSPSCలో అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకానికి సంబంధించిన ప్రశ్నపత్రం లీకేజీ(tspsc question paper leakage) ఘటనపై 48 గంటల్లో విచారణ జరిపి నివేదిక సమర్పించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai ) ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శికి గవర్నర్ తమిళిసై మంగళవారం లేఖ రాసి పేర్కొన్నారు. మరోవైపు ఈ ఘటనకు సంబంధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలు విద్యార్థి సంఘాలతోపాటు పలు రాజకీయ పార్టీలు కూడా డిమాండ్ చేస్తున్నాయి.
వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్ల నియామకానికి సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్(tspsc question paper leakage) ఘటనపై 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని తెలంగాణ(telangana) గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(Governor Tamilisai ) TSPSCని ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని మంగళవారం గవర్నర్ TSPSC కార్యదర్శికి లేఖ రాశారు. లీకేజీ ఘటనపై వివరణాత్మక నివేదికను, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రతిపాదిత దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని గవర్నర్ కోరారు. ఈ క్రమంలో నివేదికను 48 గంటల్లో అందిచాలని లేఖలో స్పష్టం చేశారు.
మరోవైపు హైదరాబాద్ పోలీసులు కేసును సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (CCS) ప్రత్యేక దర్యాప్తు బృందానికి (SIT) బదిలీ చేశారు. ఈ కేసును బేగంబజార్ పోలీస్ స్టేషన్ నుంచి సిట్‌కు బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును అదనపు పోలీసు కమిషనర్ (Crime and SIT) పర్యవేక్షిస్తారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు TSPSC ఉద్యోగులు, ఒక పోలీసు కానిస్టేబుల్‌తో సహా తొమ్మిది మందిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేయగా, సిటీ కోర్టు వారిని మంగళవారం 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపింది.
ఇంకోవైపు ఏఈ పరీక్షను రద్దు చేయాలా వద్దా అనే అంశంపై న్యాయపరమైన అభిప్రాయం తీసుకుంటామని TSSPC చైర్మన్ జనార్దన్ రెడ్డి(tspsc chairman janardhan reddy) విలేకరులకు తెలిపారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 833 ఖాళీల కోసం మార్చి 5న TSPSC పరీక్ష నిర్వహించింది. మొత్తం 55,000 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ప్రశ్నాపత్రాలు భద్రపరిచిన కంప్యూటర్ సిస్టమ్‌ను ఎవరో హ్యాక్ చేసినట్లు కమిషన్ అధికారులు గుర్తించడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.
పేపర్ లీక్ ఘటన నేపథ్యంలో పలు విద్యార్థి సంఘాలు ఆందోళన(protest) నిర్వహించారు. TSPSC కార్యాలయం వెలుపల భారతీయ జనతా యువమోర్చా (BJYM) కార్యకర్తలు నిరసన తెలిపారు. పార్టీ జెండాలు చేతపట్టుకుని కార్యాలయం గేట్లు దూకి భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు ప్రవేశ ద్వారం వద్ద ఉన్న TSPSC బోర్డును కూడా ధ్వంసం చేశారు. బహుజన్ సమాజ్ పార్టీ (BSP), యువజన కాంగ్రెస్‌కు చెందిన నిరసనకారులు కూడా కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. ఆ క్రమంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కొత్తగా వచ్చిన నోటిఫికేషన్లలో గ్రూప్ 1 సహా ఇప్పటివరకు నిర్వహించిన అన్ని పరీక్షలకు రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.