CM Jagan:ఏటా మత్స్యకార కుటుంబాలకు సాయం చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ (CM Jagan) అన్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో మత్స్యకార భరోసా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. గత ప్రభుత్వం మత్స్యకారులను విస్మరించిందని తెలిపారు. తుఫాన్, ఇతర కారణాల వల్ల చేపల వేటకు వెళ్లకపోవడంతో సాయం అందజేస్తారు. చంద్రబాబు హయాంలో ఐదేళ్లు కేవలం 104 కోట్లు ఇచ్చారని సీఎం జగన్ (CM Jagan) గుర్తుచేశారు. అప్పుడు 60 వేల మంది మత్స్యకారులు ఉండగా.. రూ.4 వేలు చొప్పున పరిహారం అందజేశారని వివరించారు. తమ ప్రభుత్వం రూ.10 చొప్పున పరిహారం ఇస్తుందని తెలిపారు. ఇప్పుడు లక్ష 23 వేల మందికి.. రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం అని తెలిపారు. ఒక్క ఏడాదికే రూ. 120 కోట్ల నిధులు ఇస్తున్నామని తెలిపారు.
1100 బోట్లకు లీటర్‌కు రూ.6 సబ్సిడీ ఇచ్చేవారని సీఎం జగన్ (CM Jagan) గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మాత్రం 20 వేల బోట్లకు సబ్సిడీ ఇస్తున్నామని పేర్కొన్నారు. సబ్సిడీ కూడా రూ.9 ఇస్తున్నామని వివరించారు. బంక్‌కు వెళ్లి డీజిల్ పోయించుకున్న సందర్భంలో రూ.9 కట్ చేసి సబ్సిడీ ఇస్తున్నామని తెలిపారు.
చేపల వేటకు వెళ్లి చనిపోయిన సందర్భాల్లో గత ప్రభుత్వం సాయం చేయలేదని పేర్కొన్నారు. సాయం కోసం అడిగితే మృతదేహాం చూపించాలని కోరిన సందర్భాలను వివరించారు. వేటకు వెళ్లి చనిపోయిన కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామని భరోసాను కల్పించారు.
నిజాంపట్నంలో ఫిషింగ్ హర్బర్ పనులు వేగంగా జరుగుతున్నాయని సీఎం జగన్ (CM Jagan) ప్రకటించారు. 6 ఫిష్ ల్యాండింగ్ ఏర్పాటు చేస్తున్నాయని ఆయన వివరించారు. ఆక్వా రైతులకు విద్యుత్ సబ్సిడీ అంజదేస్తున్నామని తెలిపారు.