gorantla buchi babu gets bail:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్టై తీహార్ జైలులో ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు ఊరట కలిగింది. ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు ఇచ్చింది. రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ ఇవ్వగా.. పాస్ పోర్ట్ అప్పగించాలని కోరింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు.
gorantla buchi babu gets bail:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) అరెస్టై తీహార్ జైలులో (tihar jail) ఉన్న గోరంట్ల బుచ్చిబాబుకు (gorantla buchibabu) ఊరట కలిగింది. ఆయనకు షరతులతో (conditions) కూడిన బెయిల్‌ను రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఇచ్చింది. రూ.2 లక్షల (rs.2 lakhs) పూచీకత్తుపై బెయిల్ ఇవ్వగా.. పాస్ పోర్ట్ (passport) అప్పగించాలని కండీషన్ విధించింది. దీంతో ఆయన జైలు నుంచి బయటకు రానున్నారు. గోరంట్ల బుచ్చిబాబు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (kavitha) మాజీ ఆడిటర్ అనే సంగతి తెలిసిందే.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో గత నెల 8వ తేదీన గోరంట్ల బుచ్చిబాబును (gorantla buchibabu) సీబీఐ అధికారులు (cbi officials) అరెస్ట్ చేశారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు పాత్ర ఉందని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌కు చెందిన పలు సంస్థలకు లబ్ది చేకూరేలా వ్యవహరించారని చెప్పి సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనను సీబీఐ అరెస్ట్ చేయగా.. ఈడీ (ed) కూడా ప్రశ్నించింది.
లిక్కర్ స్కామ్ కేసులో (delhi liquor scam) రామచంద్ర పిళ్లై 14వ నిందితుడిగా ఉన్నాడు. అతనికి గోరంట్ల బుచ్చిబాబు సీఏగా ఉన్నారు. లిక్కర్ పాలసీ రూపకల్పనలో బుచ్చిబాబు కీ రోల్ పోషించారట. సౌత్ గ్రూప్ (south group) ద్వారా వంద కోట్ల రూపాయల ముడుపులు ఆప్‌కు చేరడంలో బుచ్చిబాబు ముఖ్యపాత్ర పోషించారని తెలిసింది. లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ రాష్ట్రం నుంచి అభిషేక్ బోయినపల్లి తర్వాత సీబీఐ అరెస్టు చేసిన రెండో వ్యక్తి బుచ్చిబాబు.. ఇప్పుడు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు ఇచ్చింది.
ఇటు ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో మాజీమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి (judicial custody) తరలించారు. ఆయనను తీహార్ జైలుకు (tihar jail) అధికారులు తీసుకెళ్లారు. లిక్కర్ స్కామ్‌లో (liquor scam) అరెస్టయిన మనీశ్ సిసోడియాను గత వారం రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకూ 12 మందిని సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (gorantla buchibabu), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (magunta srinivasulu reddy) కుమారుడు రాఘవ (raghava) ఉన్నారు. బుచ్చిబాబుకు బెయిల్ లభించింది. తర్వాత కవిత అరెస్ట్ అని బీజేపీ నేతలు అంటున్నారు.