Manish Sisodia judicial custody:14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి మనీశ్ సిసోడియా
Manish Sisodia judicial custody:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీమంత్రి మనీశ్ సిసోడియా 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి తరలించారు. ఆయనను తీహార్ జైలుకు తరలించనున్నారు. లిక్కర్ స్కామ్లో అరెస్టయిన సిసోడియాను గత వారం రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
Manish Sisodia judicial custody:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో మాజీమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) 14 రోజుల జ్యుడిషీయల్ కస్టడీకి (judicial custody) తరలించారు. ఆయనను తీహార్ జైలుకు (tihar jail) అధికారులు తరలిస్తారు. లిక్కర్ స్కామ్లో (liquor scam) అరెస్టయిన మనీశ్ సిసోడియాను గత వారం రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.
లిక్కర్ స్కామ్ కేసులో ఏడుగురి పేర్లను సీబీఐ(CBI) అధికారులు చేర్చారు. ఆ లిస్ట్ లో తొలుత మనీశ్ సిసోడియా (manish sisodia) పేరు తొలుత లేదు. ఆ తర్వాత ఆధారాలతో అరెస్ట్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లిక్కర్ టెండర్లు కట్టబెట్టారనే నేపథ్యంలో మనీశ్ సిసోడియా(Manish Sisodia)పై పలు అభియోగాలు ఉన్నాయి. ఆయనను ఇటీవల అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
మనీశ్ సిసోడియాను (Manish Sisodia) ఫిబ్రవరి 26వ తేదీన 8 గంటలపాటు ప్రశ్నించిన తర్వాత సీబీఐ (cbi) అధికారులు అరెస్ట్ చేశారు. విచారణకు సహకరించడం లేదని అదుపులోకి తీసుకున్నారు. ఆ మరునాడు కోర్టులో (court) ప్రవేశపెట్టారు. కోర్టు 5 రోజుల (5 days) కస్టడీ విధించింది. తర్వాత కోర్టుకు తీసుకెళ్లగా మరో రెండు రోజులు కస్టడీ ఇచ్చింది. ఆ గడువు ముగియడంతో ఈ రోజు మరోసారి కోర్టుకు తరలించారు. కస్టడీ కాకుండా జ్యుడిషీయల్ రిమాండ్ కోరారు. న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. బెయిల్ కోసం మనీశ్ సిసోడియా దరఖాస్తు చేశారు. ఆ పిటిషన్పై ఈ నెల 10వ తేదీన విచారణ జరగనుంది.
లిక్కర్ స్కామ్లో ఇప్పటి వరకూ 12 మందిని సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేశారు. వారిలో కల్వకుంట్ల కవిత మాజీ అడిటర్ గోరంట్ల బుచ్చిబాబు (gorantla buchibabu), వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి (magunta srinivasulu reddy) కుమారుడు రాఘవ (raghava) ఉన్నారు. ఆ తర్వాత కవిత అరెస్ట్ అని బీజేపీ నేతలు అంటున్నారు. సౌత్ గ్రూపును కవిత మెయింటెన్ చేశారని.. ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.150 కోట్లు ఇచ్చారని ఆ పార్టీ నేతలు వివేక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు.