»Garbh Sanskar Rss Outfit Starts Teaching Cultural Values In Womb
Garbh Sanskar: సంస్కార పాఠాల కోసం RSS సరికొత్త ప్రోగ్రామ్
ఆరెస్సెస్ సంస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో ఇటీవల దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యువత పెడద్రోవన పడుతోంది. వీటి నుండి విముక్తి కలిగించి, విలువలు నింపేందుకు గర్భ్ సంస్కార్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆరెస్సెస్ కు (RSS) చెందిన రాష్ట్రీయ సేవికా సమితి (Rashtra Sevika Samiti) అనుబంధ సంస్థ సంవర్దినీ న్యాస్ (Samvardhinee Nyas). అంటే గర్భంలో ఉండగానే శిశువులకు సంస్కారాన్ని అలవరిచేలా గర్భిణీల కోసం దీనిని తీసుకు వచ్చారు. దీని వల్ల శిశు
రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ (rashtriya swayamsevak sangh-RSS)… సమాజంలో ఉన్నత విలువలు, దేశ భక్తిని నింపే దాదాపు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన ఓ సంస్థ. ఎక్కడైనా ఆపద వచ్చిందంటే… ప్రభుత్వం కంటే ముందే అక్కడకు చేరుకొని, కులం, మతం, వర్గం, ప్రాంతం… చూడకుండా సహాయ సహకారాలు అందించిన ఉదాహరణలు కోకోల్లలు. అలాంటి సంస్థ మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సమాజంలో ఇటీవల దారుణాలు వెలుగు చూస్తున్నాయి. యువత పెడద్రోవన పడుతోంది. వీటి నుండి విముక్తి కలిగించి, విలువలు నింపేందుకు గర్భ్ సంస్కార్ పేరుతో మరో కార్యక్రమాన్ని ప్రారంభించింది ఆరెస్సెస్ కు (RSS) చెందిన రాష్ట్రీయ సేవికా సమితి (Rashtra Sevika Samiti) అనుబంధ సంస్థ సంవర్దినీ న్యాస్ (Samvardhinee Nyas). అంటే గర్భంలో ఉండగానే శిశువులకు సంస్కారాన్ని అలవరిచేలా గర్భిణీల కోసం దీనిని తీసుకు వచ్చారు. దీని వల్ల శిశువులకు విలువలు, సంస్కృతి పైన అవగాహన ఏర్పడుతుందని ఆ సంస్థ జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి మాధురి మరాథే (Madhuri Marathe, national organising secretary of Samvardhinee Nyas) తెలిపారు.
గర్భిణీలుగా ఉన్నప్పటి నుండి మొదలు పిల్లలు పుట్టి, వారికి రెండేళ్లు వచ్చే వరకు ఈ శిక్షణ ఉంటుందని మాధురి తెలిపారు. గైనకాలజిస్టులు, ఆయుర్వేదిక్ డాక్టర్లు, యోగా శిక్షకులతో కలిసి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆమె తెలిపారు. ఇందులో గర్భిణీలకు గీతా పారాయణం, రామాయణ పాఠాలు, యోగా శిక్షణ ఉంటాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర అంశాలు చెప్పారు. గర్భంలో ఉన్న శిశువు 500 పదాలను నేర్చుకునే అవకాశం ఉందని, మొదట వెయ్యి మంది గర్భీణీలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేస్తున్నట్లు తెలిపారు. తొమ్మిది నెలలు గర్భంలో, పుట్టిన తర్వాత రెండేళ్లు… అంటే దాదాపు వెయ్యి రోజుల పాటు ఈ కార్యక్రమం ఉంటుందని, దీని వల్ల రానున్న జనరేషన్ మరింత విలువలు, మహిళల పట్ల గౌరవం నేర్చుకుంటారని చెప్పారు. ఈ ఆలోచన మరాఠా రూలర్ శివాజీ తల్లి నుండి వచ్చినట్లు చెప్పారు. గర్భ సంస్కార్ వల్ల మనకు విలువల రూపంలో శివాజీయే ప్రత్యక్ష సాక్ష్యం అన్నారు.
గర్భ సంస్కార్ అనేది మంచి ఆలోచన అని ప్రముఖ గైనకాలజిస్టులు చెబుతున్నారు. మహా భారతంలో అభిమన్యుడి కథ ఆధారంగా దీనిని రూపొందించారన్నారు. చరిత్ర ఆధారాలతో పాటు సైన్స్ అవసరమని, మంచి ఆహారం, మంచి ఆలోచనలు తోడైతే మంచి ఫలితాలు రావడం ఖాయమని అంటున్నారు డాక్టర్లు. గర్భ సంస్కార్ అనేది శిశువుల అభివృద్ధికి తోడ్పడే టెక్నిక్ అని, తల్లి మానసిక పరిస్థితి కూడా శిశువుల పెరుగుదలకు ఎంతో ముఖ్యమని చెబుతున్నారు. మొత్తానికి ఆరెస్సెస్ వింగ్ ప్రారంభించిన ఈ కార్యక్రమంపై సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి.
గర్భ సంస్కార్ ప్రచారంలో భాగంగా సంవర్ధినీ న్యాస్ మార్చి 5వ తేదీన జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఒక వర్క్ షాప్ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎయిమ్స్-ఢిల్లీకి చెందిన పలువురు గైనకాలజిస్టులు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా జేఎన్యూ వైస్ ఛాన్సులర్ శాంతిశ్రీ దూళిపూడి పండిట్ (JNU Vice-Chancellor Santishree Dhulipudi Pandit) హాజరు కాలేదు.