»Manipur Violence Rss Appeals For Peace Says Situation Extremely Worrisome
Manipur violence:మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై RSS ఆందోళన
శతాబ్దాలుగా పరస్పర సామరస్యం, సహకారంతో శాంతియుత జీవితం గడిపిన వారిలో ఆ తర్వాత చెలరేగిన అశాంతి, హింస ఇంకా ఆగకపోవడం చాలా దురదృష్టకరమని ఆర్ఎస్ఎస్ పేర్కొంది.
Manipur violence:మణిపూర్లో గత ఒకటిన్నర నెలలుగా హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి. ఈ హింసలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) శాంతిభద్రతలను కాపాడాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అదే సమయంలో హింసాత్మక ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మణిపూర్లో 45 రోజులుగా కొనసాగుతున్న హింస చాలా ఆందోళన కలిగిస్తోందన్నారు. మే 3న చురాచంద్పూర్లో లై హరోబా పండుగ సందర్భంగా నిర్వహించిన నిరసన ర్యాలీ తర్వాత హింస ప్రారంభమైంది.
శతాబ్దాలుగా పరస్పర సామరస్యం, సహకారంతో శాంతియుత జీవితం గడిపిన వారిలో ఆ తర్వాత చెలరేగిన అశాంతి, హింస ఇంకా ఆగకపోవడం చాలా దురదృష్టకరమని ఆర్ఎస్ఎస్ పేర్కొంది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ దుఃఖ సమయంలో 50,000 మందికి పైగా ఉన్న నిర్వాసితులకు,ఇతర బాధితులకు అండగా నిలుస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో హింసకు, ద్వేషానికి తావు లేదని, శాంతియుత వాతావరణంలో పరస్పర చర్చలు, సౌభ్రాతృత్వాన్ని చాటుకోవడం ద్వారానే ఏ సమస్యనైనా పరిష్కరించుకోవచ్చని ఆర్ఎస్ఎస్ అభిప్రాయపడింది.
శాంతిని నెలకొల్పాలని ప్రభుత్వానికి, సైన్యానికి విజ్ఞప్తి
ఈ బాధాకరమైన హింసను తక్షణమే అరికట్టడానికి.. శాంతి, సామరస్యాన్ని కాపాడే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, సైన్యానికి విజ్ఞప్తి చేసింది. అలాగే నిర్వాసితులకు నిరంతరాయంగా వస్తువుల సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని స్థానిక పరిపాలన, పోలీసు, సైన్యం, కేంద్ర ఏజెన్సీలతో సహా ప్రభుత్వానికి RSS విజ్ఞప్తి చేసింది.