»Farmers First Founder Chakradhar Goud Joins In Bjp
Chakradhar Goud: రైతుకు మరింత సాయం చేసేందుకే.. బీజేపీలోకి చక్రధర్ గౌడ్
సిద్దిపేట జిల్లాకు చెందిన, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్ చక్రధర్ గౌడ్ బుధవారం భారతీయ జనతా పార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్, చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ ల సమక్షంలో ఆయన కమలం కండువాను కప్పుకున్నారు.
సిద్దిపేట జిల్లాకు (Siddipet District) చెందిన, ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండర్ చక్రధర్ గౌడ్ (formers first founder chakradhar goud) బుధవారం భారతీయ జనతా పార్టీలో (Bharatiya Janata Party) చేరారు. ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో (Delhi BJP Office) ఆ పార్టీ నేతలు సునీల్ బన్సల్, తరుణ్ చుగ్, ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ (Bandi Sanjay), చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ (Etala Rajender) ల సమక్షంలో ఆయన కమలం కండువాను కప్పుకున్నారు. ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ (formers first foundation) పేరు మీద చనిపోయిన రైతు కుటుంబాలకు (Farmers Family) కోట్లాది రూపాయలు సాయం చేసిన వ్యక్తి చక్రధర్ (chakradhar goud). గత ఏడాది సిద్దిపేటలో ఒకే వేదిక పైన, 100 మంది రైతు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1 లక్ష ఇచ్చారు. అలా ఆ ఒక్క వేదిక పై నుండే రూ.1 కోటి సాయం చేశారు. ఆ తర్వాత మరో 500 రైతు కుటుంబాలకు రూ.1 లక్ష చొప్పున ఇచ్చారు. అయితే తాను రైతులకు చేస్తున్న సాయాన్ని అధికార బీఆర్ఎస్ పార్టీ, మంత్రి హరీష్ రావులు రాజకీయం చేస్తూ, తనను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అదే సమయంలో బీజేపీ నుండి రైతులకు సాయం చేసే మంచి పని నుండి సహకారం వస్తుందనే మద్దతు లభించిందని, దీంతో ఆ పార్టీలో చేరినట్లు తెలిపారు.
బీజేపీలో (BJP) చేరడం హఠాత్తుగా తీసుకున్న నిర్ణయం కాదని, మూడు నెలలుగా ఈటెల తనతో చర్చలు జరుపుతున్నారని, అదే సమయంలో తనపై అక్రమ కేసులు పెడుతూ.. రైతులకు సాయం (Helping hand to farmers) చేయకుండా అడ్డుకుంటున్నారని, బీజేపీ (BJP) నుండి రైతులకు సాయం చేసే విషయంలో తనకు ప్రీ హ్యాండ్ ఇస్తామని హామీ వచ్చిందని తెలిపారు. తమ ప్రాంతంలో ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు (Farmers Suicide) చేసుకున్నప్పటికీ, జాబితా తయారు చేయడం లేదని, సిద్దిపేటలో నిరంకుశ పాలన కొనసాగుతోందన్నారు. బీజేపీలో చేరినప్పటికీ రైతులకు చెక్కులు ఆగవని, పార్టీ కూడా ఇంకా హెల్ప్ చేస్తామని చెప్పిందన్నారు.
‘నిన్నటి రోజు ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్,మరియు రాష్ట్ర ప్రభారీ సునిల్ భన్సల్. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారు అలాగే తెలంగాణ బీజేపీ చేరికల కమిటీ ఛైర్మెన్ ఈటెల రాజేందర్ గార్ల సమక్షంలో భారతీయ జనతా పార్టీ లో జాయిన్ అయ్యాను. దీనికి చొరవ తీసుకున్న ఈటెల రాజేందర్ అన్న గారికి మరియు బండి సంజయ్ గార్లకు నా ప్రత్యేక ధన్యవాదములు. సిద్ధిపేట బీజేపీ జిల్లా అధ్యక్షులవారికి మరియు తోటి సీనియర్ నాయకులకు ధన్యవాదములు, నాకు అండగా నిలబడిన సహచర కార్యకర్తలకు పేరుపేరునా ధన్యవాదములు. జై హింద్’ అని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు చక్రధర్ గౌడ్.