»Even If The Yamuna River Recedes The People Of Delhi Are Still In Fear
Delhi floods: యమునా నది తగ్గినా..ఇంకా భయాందోళనలో ఢిల్లీ వాసులు.!
ఢిల్లీ నగరాన్ని ముంచెత్తిన వరదలు శనివారం నాటికి కాస్త తగ్గుముఖం పట్టడంతో నగరవాసులు ఊపిరిపీల్చుకుంటున్నారు. మరో రెండు రోజులు ఢిల్లీకి వర్ష సూచనలు. ఎల్లో అలెర్డ్ ప్రకటించిన ఐఏండీ.
Even if the Yamuna river recedes.. the people of Delhi are still in panic
Delhi floods: నిన్నటి వరకు ఢిల్లీ(Delhi) ని ముంచెత్తిన వరదలు ఇప్పుడు కాస్తా తగ్గుముఖం పట్టడంతో రాజధాని కాస్త ఊపిరిపీల్చుకుంటోంది. యమునా నది(Yamuna River) నీటి మట్టం క్రమంగా తగ్గుముఖం పడుతుండడంతో ఈ వరదలకు విశ్రాంతి దొరికింది. కానీ ఇంకా నగర వాసులు మాత్రం వరద నీటితో ఇబ్బందులు పడుతున్నారు. ఐటీఓ, శాంతి వాన్ ఏరియా, ఇన్కం ట్యాక్స్ ఆఫీస్ సమీపంలో, ఇంకా పలు కీలక ప్రాంతాల్లో మోకాళ్ల లోతు వరకు నీళ్లు ఉండటంతో స్థానికులు ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది.
యమునా నది నీటిమట్టం 207 మీటర్లగా ఉంది. ఇది కూడా ప్రమాద స్థాయి కంటే రెండు మీటర్లు ఎక్కువగానే ఉన్నప్పటికి వరద ప్రవాహం తగ్గడంతో పట్టణ వాసులు కాస్త ఊరట లభించింది. ఇంకా ఢిల్లీ వాసులు పూర్తిగా బయటపడలేదు. ఇదిలా ఉంటే శనివారం రోజు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. రానున్న 3-4 రోజులు ఢిల్లీ వ్యాప్తంగా మోస్తారు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఇక ప్రస్తుత పరిస్థితులు భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ విమర్శలకు దారితీశాయి.