»Elon Musk Twitters Logo Replaced With A Doge Meme
Twitter Logo పిట్ట పోయి.. కుక్క వచ్చే.. ట్విటర్ లోగో మార్చిన ఎలన్ మస్క్
బంగారు బాతులాంటి ట్విటర్ ను చేతులారా నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ సక్రమంగా లేక ట్విటర్ త్వరలో మూతపడుతుందని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిగా ట్విటర్ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
యాజమాన్య బాధ్యతలు ఎలన్ మస్క్ (Elon Musk)కు మారినప్పటి నుంచి ట్విటర్ (Twitter)లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఇన్నాళ్లు వెరిఫైడ్ ఖాతా (Verified Account) ఉచితంగా ఉండేది.. దానికి రుసుము విధించాడు. ఉద్యోగులను భారీగా తొలగించడం మొదలుపెట్టాడు. తక్కువ మందితో ఎక్కువ పని సూత్రాన్ని అమలు చేస్తున్నాడు. దీంతో ట్విటర్ లో ఉన్న కీలక ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదులుకుంటున్నారు. వాటిని పట్టించుకోకుండా తన ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాడు. కాగా తాజాగా ట్విటర్ లోగో (Logo) మారింది. పిట్ట (Blue Bird) స్థానంలో కుక్క వచ్చింది. దీంతో పిట్ట పోయి.. కుక్క వచ్చే అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మస్క్ ను ఆటాడేసుకుంటున్నారు.
ఇప్పటివరకు ఉన్న పక్షి (బ్లూ బర్డ్) లోగోను తొలగించి దాని స్థానంలో కుక్క (Doge) ఫొటోను ఉంచాడు. అయితే ఈ మార్పు కేవలం డెస్క్ టాప్ వర్షన్ లో మాత్రమే మారింది. ఇంకా మొబైల్ ఫోన్ వినియోగంలో మార్చలేదు. ట్విటర్ వెబ్ సైట్ (Website)లో హోం బటన్ గా ఉన్న బ్లూ బర్డ్ స్థానంలో డాగీ కాయిన్ క్రిప్టో కరెన్సీ (Dogecoin cryptocurrency) లోగోకు చెందిన డాగ్ మీమ్ కనిపించింది. ఏప్రిల్ 3వ తేదీన ఈ మార్పు చేశాడు. ఈ మార్పుపై ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్ స్పందించాడు. 26 మార్చి 2022నాడు చేసిన ట్విటర్ చాట్ స్క్రీన్ షాట్ ను మళ్లీ పంచుకున్నాడు.
కాగా డాగీ కాయిన్ లోగో మార్చడంతో క్రిప్టో కరెన్సీలో డాగీ కాయిన్ షేర్లు (Shares) పతనమయ్యాయి. దాదాపు 20 శాతం విలువ పడిపోయింది. ఇలా తలతిక్క యవ్వారాలతో మస్క్ తీరుపై ట్విటర్ వినియోగదారులతో పాటు నెటిజన్లు మండిపడుతున్నారు. బంగారు బాతులాంటి ట్విటర్ ను చేతులారా నాశనం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్వహణ సక్రమంగా లేక ట్విటర్ త్వరలో మూతపడుతుందని యూజర్లు ఆందోళన చెందుతున్నారు. పిచ్చోడి చేతిలో రాయిగా ట్విటర్ మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.