ATP: గుత్తి శివారులోని కాశేపల్లి టోల్గేట్ ప్లాజా వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. బెంగళూరు నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.