kavitha దీక్షకు ఢిల్లీ పోలీసుల షరతులు.. సగం స్థలం వాడుకోవాలంటూ మెలిక?
kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఢిల్లీ పోలీసులు (delhi police) పలు షరతులు విధించారు. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టే దీక్షకు (deeksha) కండీషన్స్ పెట్టారు. మహిళా రిజర్వేషన్ (women reservaton) కోసం దీక్ష చేపడుత్న సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నాకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు (delhi police) సగం స్థలం మాత్రమే వాడుకోవాలని అంటున్నారు.
kavitha:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) ఢిల్లీ పోలీసులు (delhi police) పలు షరతులు విధించారు. రేపు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద చేపట్టే దీక్షకు (deeksha) కండీషన్స్ పెట్టారు. మహిళా రిజర్వేషన్ (women reservaton) కోసం దీక్ష చేపడుత్న సంగతి తెలిసిందే. అందుకోసం ఆమె నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్నారు. ధర్నాకు సంబంధించి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీ పోలీసులు (delhi police) సగం స్థలం మాత్రమే వాడుకోవాలని అంటున్నారు. మిగతా ప్లేస్లో బీజేపీ నేతల కార్యక్రమం ఉందని చెబుతున్నారు. తమకు ముందు ఇచ్చిన అనుమతి మేరకు దీక్ష చేపడతామని కవిత నేతృత్వంలో గల భారత్ జాగృతి అంటోంది. తమ సభాస్థలి వద్దకు 5 వేల మంది (5 thousand) వస్తారని కవిత (kavitha) చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ నేతల పేరుతో అడ్డుకోవడం తగదని చెప్పారు. తమకు ఢిల్లీ పోలీసులు (delhi police) సహకరిస్తారని అనుకుంటున్నామని చెప్పారు. దీనికి సంబంధించి అరగంటలో క్లారిటీ వస్తుందని కవిత చెప్పారు.
మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కోసం కవిత (kavitha) దీక్ష చేపడుతున్నారు. అన్ని పార్టీల ప్రతినిధులు పాల్గొని.. ఢిల్లీలో (delhi) సత్తా చాటనున్నారు. రేపు దీక్ష తర్వాత.. ఎల్లుండి ఆమె ఈడీ (ed) విచారణకు హాజరకానున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో (delhi liquor scam) ఇప్పటికే ఆమెను సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. శనివారం ఈడీ ప్రశ్నించనుంది. వాస్తవానికి రేపు (శుక్రవారం) విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో ఈడీ (ed) పేర్కొంది. తమకు ఇతర కార్యక్రమాలు ఉన్నందున.. తేదీ మార్చాలని కవిత (kavitha) లేఖ రాశారు. ఇందుకు ఈడీ సమ్మతించింది. శనివారం విచారణకు హాజరుకావాలని స్పష్టంచేసింది. మరోవైపు కవిత (kavitha) అరెస్ట్ అంటూ విపక్ష నేతలు కామెంట్స్ చేస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ నేతలు కూడా దానికి కౌంటర్ ఇస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత (kavitha) మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఇదివరకే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తీహర్ జైలు నుంచి ఆయన ఇటీవలే బయటకు వచ్చారు. రామచంద్ర పిళ్లై కూడా విచారణలో కవిత పేరు చెప్పారట. దీంతో కవిత మెడకు ఉచ్చు బిగుస్తోందని విపక్షాలు అంటున్నాయి.