హైదరాబాద్లో(Hyderabad) ఓ పెళ్లి వేడుకకు వంట చేసేందుకు వచ్చి మళ్లీ తిరిగి వెళ్తున్న క్రమంలో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) సంభవించింది. కారు(car)ను డీసీఎం(dcm) ఢీ కొట్టిన ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృత్యువాత చెందారు. ఈ ఘటన రంగారెడ్డి(rangareddy) జిల్లా మహేశ్వరం పరిధిలోని తుమ్మనూరు గేట్ సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చనిపోయిన వారంతా నాగర్ కర్నూల్(nagar kurnool) జిల్లా వాసులుగా పోలీసులు(police) గుర్తించారు. వారిలో పోతేపల్లికి చెందిన కేశవులు, యాదయ్య, శ్రీను, లింగారెడ్డి గ్రామానికి చెందిన రామస్వామి ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇక అసలు ప్రమాదానికి గల కారణాలు ఏంటి ? వాహనం నడుపుతున్న వ్యక్తి మద్యం సేవించాడా? అతి వేగం కారణంగానే ప్రమాదం జరిగిందా అనే కోణాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.