ASR: డుంబ్రిగూడ మండలంలోని కొత్తవలస గ్రామ మలుపు వద్ద శనివారం రాత్రి రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. స్థానికులు హుటాహుటిన క్షతగత్రులను 108 అంబులెన్స్‌లో జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.