ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం(delhi liquor scam) కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ed) దర్యాప్తు వేగం మరింత పెంచింది. ఈ క్రమంలో ఇప్పటికే ఈడీ కస్టడీలో ఉన్న రాఘవరెడ్డికి అవెన్యూ కోర్టు కస్టడీని 14 రోజులు పొడిగించింది. ఫిబ్రవరి 10న అరెస్టైన రాఘవ ప్రస్తుతం ఢిల్లీలోని తిహాడ్ జైలులో ఉన్నారు. ఏపీ వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి జ్యూడిషియల్ కస్టడీని పొడిగించాలని ఈడీ కోరడంతో.. సీబీఐ ప్రత్యేక కోర్టు పెంచింది. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాంలో రాఘవరెడ్డి పాత్ర ఉందని ఈడీ నిర్ధారించింది. ఢిల్లీలోని తమ కార్యాలయంలో రాఘవరెడ్డిని ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ చేసింది. ఈ కేసులో రాఘవరెడ్డిని సీబీఐ కూడా గతంలో ప్రశ్నించింది.
గత కొన్ని రోజులుగా రాఘవరెడ్డిని ప్రశ్నించిన ఈడీ అధికారులు…విచారణకు సహకారం అందించడం లేదనే కారణంతో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు పేర్లు సహా పలువురిని నిందితులుగా ఈడీ పేర్కొంది. మాగుంట రాఘవరెడ్డిని గత ఏడాది అక్టోబర్లో కూడా సీబీఐ ఈ కేసు విషయంలో పలు వివరాలను ఆరా తీసింది. అదే సమయంలో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను కూడా ఇటీవల అరెస్టు చేసింది.
మరోవైపు ఈ ఘటనపై ఇప్పటికే స్పందించిన మాగుంట శ్రీనివాసులు(magunta sreenivasulu reddy) తమ బంధువుల పేర్లలో మాగుంట ఉందని తమపై కేసులు పెట్టడం కరెక్టు కాదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో తమ కుమారుడు రాఘవరెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు. తమ బంధువులు మాత్రం ఢిల్లీలోని 32 జోన్లలో మద్యం వ్యాపారాలు చేస్తున్నట్లు చెప్పారు.
ఇటీవల ఈ కేసులో ఫిబ్రవరి 9న ఈడీ అధికారులు చారియట్ మీడియా అధినేత రాజేష్ జోషి(rajesh joshi)ని అరెస్టు చేశారు. సౌత్ గ్రూపునకు 31 కోట్ల రూపాయలు రాజేష్ జోషి బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ డబ్బును గోవా ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కోసం ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే ఆ నగదు మొత్తం హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించినట్లు అధికారులు చెబుతున్నారు.
అంతకు ముందు ఫిబ్రవరి 8న తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, BRS ఎమ్మెల్సీ కవిత మాజీ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబును సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకున్న కాసేపటికే గౌతమ్ మల్హోత్రాను ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీకి చెందిన బ్రింకక్ కో సేల్స్ కంపెనీకి ఆయన డైరెక్టర్ గా ఉన్నారు. ఇతనికి ఆప్ నేతలకుపాటు పలవురికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, వారి ప్రమేయంతో లిక్కర్ స్కాం చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో పలువురు రాజకీయ నాయకులు సహా వ్యాపారుల పేర్లను సైతం ఈడీ(ED) చేర్చింది. మొత్తం 17 మందిపై అభియోగాలు నమోదు చేసిన ఈడీ…ఇటీవల రూపొందించిన చార్జీషీటులో డిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) పేరును కూడా చేర్చింది. అతనితోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(kavitha), వైసీపీ ఎంపీ కుమారుడు మాగుంట రాఘవరెడ్డి, అభిషేక్ బోయినపల్లి, సమీర్ మహేంద్రు, అమిత్ అరోరా, శరత్ చంద్రా, విజయ్ నాయర్ సహా 17 మందిపై అభియోగాలు నమోదయ్యాయి.