TTD: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..దర్శనానికి 30 గంటల సమయం
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమల(Tirumala)కు భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో ఆదివారం భక్తులతో కొండపై ఉన్న కంపార్టెమెంట్లన్నీ నిండిపోయాయి.
తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో తిరుమల(Tirumala)కు భక్తులు భారీగా తరలి వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం రాత్రి నుంచే భక్తులు తిరుమలకు చేరుకున్నారు. దీంతో ఆదివారం భక్తులతో కొండపై ఉన్న కంపార్టెమెంట్లన్నీ నిండిపోయాయి. భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. శనివారం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని 75,728 మంది దర్శించుకున్నారు. అదేవిధంగా 38,092 మంది తమ తలనీలాలను సమర్పించారు. శనివారం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో హుండీ ఆదాయం పెరిగింది. దీంతో నిన్న భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.15 కోట్లు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు తెలిపారు.
భారీగా భక్తులు రావడంతో దర్శనానికి చాలా సమయం పడుతోంది. శ్రీవారిని దర్శించుకోవడానికి టోకెన్లు లేని భక్తులు 30 గంటలు ఎదురుచూడాల్సి వస్తోంది. సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతోందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు. మరోవైపు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సకాలంలో భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారు. అలాగే పానీయాలు, అల్పాహారం అందిస్తున్నారు.
మరోవైపు శ్రీవారి భక్తులకు టీటీడీ(TTD) అధికారులు శుభవార్త చెప్పారు. ఫిబ్రవరి 13వ తేది ఉదయం 9 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్లైన్ కోటా టికెట్లను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి 22వ తేది నుంచి ఫిబ్రవరి 28వ తేది వరకూ జరగాల్సిన బాలాలయం కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు తెలిపారు.
దీంతో ఆ తేదీల వారీగా గతంలోనే విడుదల చేయాల్సిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం కోటా టికెట్లను విడుదల చేయడం లేదని వెల్లడించారు. బాలాలయం కార్యక్రమం వాయిదాతో వాటిని ఈనెల 13వ తేదిన విడుదల చేయనున్నట్లు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్లైన్లో టోకెన్లు బుక్ చేసుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు విజ్ఞప్తి చేశారు.
శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతనంగా నిర్మించిన పరకామణి భవనంలో లెక్కిస్తున్నారు. బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ సహకారంతో ఈ భవనాన్ని అత్యాధునిక భద్రతతో ఏర్పాటు చేసినట్లు టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల(Tirumala) పెద్దజీయర్ స్వామి వారి ఆశీస్సులతో శ్రీవారి ఆలయం నుంచి 12 హుండీలను చిన్న లిఫ్ట్ సహాయంతో లారీల ద్వారా పరకామణి భవణానికి తరలించారు. ఇకపై రోజూ అన్ని హుండీలు నూతన పరకామణి భవనానికి చేరకుంటాయని, త్వరలోనే అక్కడే భక్తులు కూర్చునే విధంగా ఆ భవణాన్ని తీర్చిదిద్దుతున్నట్లు వెల్లడించారు. తిరుమల(Tirumala) శ్రీవారికి ప్రతి ఏడాది మే, జూన్ నెలల్లో హుండీ ద్వారా లభించే ఆదాయం నెలకు రూ.100 కోట్లు దాటేదని, మిగిలిన నెలల్లో నెలకు రూ.100 కోట్లలోపే ఉండేదని, ప్రస్తుతం శ్రీవారికి నిత్యం రూ.4 కోట్లకు పైగా హుండీ ఆదాయం లభిస్తోందని తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అదికారులు తెలిపారు. ఈ ఏడాది మొత్తం ఆదాయం రూ.1500 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నామన్నారు.