»Congress Worker Showers Money On Female Dancer In Karnataka
Congress showers money: డ్యాన్సర్‌పై డబ్బుల వర్షం కురిపించిన కాంగ్రెస్ నేత
కర్నాటకలోని ధార్వాడ్ జిల్లాలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళా డ్యాన్సర్ పైన డబ్బుల వర్షం కురిపించాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సదరు కాంగ్రెస్ నాయకుడి పేరు శివశంకర్ హంపనవ. అతను తన స్నేహితుడి ఇంట్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళ పైన నోట్లు వెదజల్లుతున్న వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి.
కర్నాటకలోని (Karnataka) ధార్వాడ్ జిల్లాలో ఓ కాంగ్రెస్ పార్టీ నాయకుడు (Congress Party leader) స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళా డ్యాన్సర్ పైన డబ్బుల వర్షం (showers money on dancer) కురిపించాడు. ఇది ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. సదరు కాంగ్రెస్ నాయకుడి పేరు శివశంకర్ హంపనవ. అతను తన స్నేహితుడి ఇంట్లో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో స్టేజ్ పైన డ్యాన్స్ చేస్తున్న మహిళ పైన నోట్లు వెదజల్లుతున్న వీడియో, ఫోటోలు బయటకు వచ్చాయి. సదరు డ్యాన్సర్ ప్రముఖ కన్నడ పాటకు డ్యాన్స్ చేస్తోంది. ఆ సమయంలో డ్యాన్సర్ తో పాటు కాంగ్రెస్ నాయకుడు కూడా డ్యాన్స్ చేశాడు. అక్కడే ఆయన స్నేహితులు ప్రోత్సహిస్తున్నారు. ఆ నాయకుడు ఆమెతో పాటు డ్యాన్స్ చేస్తూ, డబ్బులు వెదజల్లాడు.
కర్నాటకలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, త్రిపుర, మేఘాలయలలో జరిగిన ఎన్నికల్లో కమలదళం విజయం సాధించింది. కర్నాటకలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. దీనిపై బీజేపీ దృష్టి సారించింది. ఇలాంటి సమయంలో ప్రతి విషయం చర్చనీయాంశంగా మారుతుంది. కాంగ్రెస్ నేత… డ్యాన్సర్ పైన డబ్బులు వెదజల్లిన ఘటన ఎన్నికలకు ముందు స్థానికంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకునే అవకాశం ఉంటుంది.
అంతకుముందే, కర్నాటకలోని మాండ్య (Mandya) నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు (Congress Party district president) సీడీ గంగాధర్ కారు పైన (Attack on Car) ఓ కార్యకర్త గుడ్డుతో దాడి చేశాడు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించలేదనే ఆగ్రహంతో అతను గుడ్డుతో దాడి చేశాడు. కారు పైన గుడ్డు విసిరేసిన వీడియో కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది.
స్థానిక మీడియా కథనం ప్రకారం గంగాధర్ తన కారులో సోమవారం కేఆర్ పేట అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్లారు. ఎన్నికల ప్రణాళికల గురించి స్థానిక నాయకులతో మాట్లాడుతున్నారు. అయితే నియోజకవర్గం అభ్యర్థి పైన పలువురు కార్యకర్తలు డిమాండ్ చేశారు. అభ్యర్థి పేరు వెంటనే చెప్పాలని పెద్ద ఎత్తున కార్యకర్తలు నినాదాలు చేశారు. గంగాధర్ మాత్రం ఈ ఘటన జరుగుతున్న సమయంలో మౌనంగా నిల్చొని, నవ్వుతూ కనిపించాడు. కార్యకర్తలు గట్టిగా నిలదీయడంతో అతను కారులోకి వెళ్లి కూర్చున్నారు. దీంతో ఓ కార్యకర్త కారు పైన గుడ్డు విసిరేశాడు.