»Congress Will Challenge The Surat Court Verdict Against Rahul Gandhi
Rahul Gandhiపై వేటు సూరత్ కోర్టు తీర్పును సవాల్ చేయనున్న కాంగ్రెస్
రాహుల్ గాంధీ(Rahul gandhi) లోక్ సభ సభ్యత్వం రద్దు అంశంపై కాంగ్రెస్ నేతలు(congress leaders) అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో సోమవారం లేదా మంగళవారం ఈ అంశంపై సవాలు చేయనున్నట్లు తెలుస్తోంది. సూరత్ కోర్టు(surat court) తీర్పును సవాలు చేయడంతోపాటు మరిన్ని అభిప్రాయాలను కాంగ్రెస్ తెలుపనున్నట్లు సమాచారం. మరోవైపు రాహుల్ గాంధీ వేటును భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే గా పలువురు నేతలు అభివర్ణించారు.
పరువు నష్టం కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ(Rahul gandhi)పై శుక్రవారం సూరత్ కోర్టు(surat court) తీర్పు ఇవ్వగా..లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడింది. ఈ తీర్పుపై అత్యున్నత న్యాయస్థానంలో అప్పీల్ చేసేందుకు కాంగ్రెస్(congress party) సిద్ధమవుతుంది. సోమవారం లేదా మంగళవారం ఈ తీర్పు పై సవాల్ చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే గతంలో పలు కేసుల్లో సభ్యత్వం పునరుద్ధరించాలని వెల్లడించిన తీర్పులను ప్రస్తావించనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేరారోపణపై స్టే పొందుతామని కాంగ్రెస్ నేతలు(congress leaders) అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చట్టంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని అంటున్నారు. భవిష్యత్తులో మేం విజయం సాధిస్తామని నమ్ముతున్నామని కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు.
మార్చి 23న సూరత్ కోర్టు తీర్పు ఇవ్వగా..వెంటనే మార్చి 24న రాహుల్(Rahul)పై అనర్హత వేటు వేయడంపై పలువురు నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై చట్టపరమైన సమీక్ష కోసం సమయాన్ని కూడా ఇవ్వలేదని అంటున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఇది మరో క్రూరమైన దెబ్బ అని కాంగ్రెస్ పార్టీ నేత చిదంబరం ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశ్నించినందుకే కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు.
ఈ కేసుపై ఇప్పటికే రాహుల్ గాంధీ(Rahul gandhi) కూడా రియాక్ట్ అయ్యారు. తాను దేశం కోసం ఎలాంటి పోరాటానికైనా సిద్ధమని, ఎంత వరకైనా వెళ్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రాహుల్ 2019 లోక్ సభ ఎన్నికల సందర్భంగా కర్ణాటకలోని కోలార్‌లో జరిగిన ర్యాలీలో సాధారణంగా దొంగలందరి ఇంటిపేర్లు మోడీ అనే ఎందుకు ఉంటాయని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ప్రధాని మోడీ(modi)ని ఉద్దేశించి ఆయన ఈ మాటలన్నారు. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పరువు నష్టం కేసులో సూరత్ కోర్టు నాలుగేళ్ల తర్వాతా మార్చి 24న తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో రెండేళ్ల జైలు శిక్షను విధిస్తూ పై స్థాయి కోర్టులో సవాలు చేసుకునేందుకు 30 రోజుల సమయం కూడా ఇచ్చింది.