»A Person Who Was Sleeping In A Car Was Burnt Alive In Hyderabad
Fire Accident: హైదరాబాద్లో కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవదహనం
హైదరాబాద్(hyderabad) నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఈ అగ్ని ప్రమాదం దాటికి కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కింగ్ కోఠి(king koti)లో చోటుచేసుకుంది.
హైదరాబాద్(hyderabad) నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం(fire accident) జరిగింది. ఈ ప్రమాదం దాటికి కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనం చెందాడు. ఈ ఘటన హైదరాబాద్లోని కింగ్ కోఠి(king koti)లో చోటుచేసుకుంది. అయితే బొగ్గుల కుంటలోని ఓ మెకానిక్ షెడ్డులో ఆకస్మాత్తుగా రాత్రి మంటలు చెలరేగడంతో కారులో నిద్రిస్తున్న వ్యక్తి సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. మృతుడు సంతోష్ అనే సెక్యూరిటీ గార్డుగా గుర్తించారు. మంటల్లో ఏడు కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఆ క్రమంలో పెద్ద పెద్ద పేలుళ్లతోపాటు దట్టమైన పొగలు వచ్చినట్లు స్థానికులు(local people) తెలిపారు. మరికొంత మంది భయాందోళనతో పరుగులు తీసినట్లు చెప్పారు. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నం చేసి వాటిని అదుపులోకి తెచ్చారు. మరోవైపు పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది అనే విషయం తెలియాల్సి ఉంది.
మరోవైపు వారి కుమారుడు రాత్రి డ్యూటీకి వెళ్లి తెల్లారే సరికి మృతి చెందడంతో అతని కుటుంబ సభ్యులు(family) విలపిస్తున్నారు. మృతి చెందిన సెక్యూరిటీ గార్డు(security guard)కు ఓ భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తన కుమారుడు ఉదయం చెప్పుల దుకాణం..రాత్రి సెక్యురిటీ గార్డుగా విధులు నిర్వహిస్తాడని అతని కుటుంబ సభ్యులు(family) తెలిపారు. వారి కుటుంబానికి ఆధారంగా ఉన్న ఒక్కడు కూడా మృతి చెందాడనీ వారు విచారం వ్యక్తం చేశారు.
ఇలాంటి క్రమంలో భాగ్యనగరంలో వరుస అగ్ని ప్రమాదాలు సంభవించడం పట్ల నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇంకోవైపు ఇటీవల సికింద్రాబాద్ లో రద్దీగా ఉండే స్వప్న లోక్ కాంప్లెక్స్(Swapnalok complex) లో భారీ అగ్ని ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు యువతులు, ఇద్దరు యువకులు ఉన్నారు.