»Cm Kcr Tour On February 14th 2023 Kondagattu Will Begin The Reconstruction Of Kondagattu
KCR: ఫిబ్రవరి 14న కొండగట్టుకు కేసీఆర్..పునర్ నిర్మాణం షురూ!
ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టు ఆలయ అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలను ప్రకటించిన సీఎం కేసీఆర్..ఈ ఆలయ అభివృద్ధి పనుల రూపకల్పన, పరిశీలన కోసం ఈనెల 14న కొండగట్టు ఆలయాన్ని సందర్శించనున్నారు.
తెలంగాణలో ఇప్పటికే యాదాద్రి ఆలయాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వం ఇటీవల జగిత్యాల జిల్లా(jagtial district)లో ఉన్న కొండగట్టు పుణ్యక్షేత్రాన్ని కూడా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం కేసీఆర్(cm kcr) పేర్కొన్నారు. ఈ క్రమంలో కొండగట్టు ఆలయ(kondagattu hanuman temple)అభివృద్ధి కోసం 100 కోట్ల రూపాయలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఈనెల 14న ఈ ఆలయాన్ని సందర్శించుకోనున్నారు. కొండగట్టు ఆలయానికి చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, మాస్టర్ ప్లాన్(master plan) రూపకల్పన సహా పలు అంశాలపై సీఎం అధికారులతో చర్చించనున్నారు. కేసీఆర్ టూర్ నేపథ్యంలో కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్టీయూ కాళాశాలలో హెలిప్యాడ్ పనులను అధికారులు పరిశీలించారు.
మరోవైపు కేసీఆర్(kcr) ఆదేశాల మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి ఈరోజు(ఫిబ్రవరి 12న) కొండగట్టుకు వెళ్లి ఆలయ పునర్ నిర్మాణ ప్రణాళికలు రూపొందించనున్నారు. ఇప్పటికే ఆనంద్ సాయి (architect anand sai) యాదాద్రి ఆలయ పునర్ నిర్మాణ పనులు, ఆలయ గోపురాలు వంటివి నిర్మించారు. ఆ క్రమంలో తనకే మళ్లీ కొండగట్టు పునర్ నిర్మాణ పనులు కూడా అప్పగించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ ప్రముఖ ఆలయమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఎక్కువ కొత్త వాహనాల పూజలకు ప్రసిద్ది చెందింది. ప్రతి రోజు అనేక కొత్త వాహనాలకు పూజలు జరిపించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఈ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు. ఇటీవల జనసేన అధ్యక్షుడు, హీరో పవన్ కల్యాణ్(pawan kalyan) కూడా తన ఎన్నికల ప్రచారం వాహనం వారాహికి ఇక్కడే పూజలు జరిపించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టారు.
మరోవైపు కేసీఆర్ ఆదేశం మేరకు హైదరాబాద్(hyderabad) లాల్ దర్వాజ(lal darwaza temple) అమ్మవారి ఆలయాన్ని కూడా విస్తరించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(talasani srinivas yadav) చెప్పారు. త్వరలోనే అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో మరో 10 రోజుల్లో భూమి పూజ చేయనున్నట్లు తెలిపారు. అందుకోసం 1100 గజాల స్థలం కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు.