»China Import Ban On Laptops And Computers India 2023
Imports ban: చైనాకు షాకిచ్చిన భారత్..ల్యాప్టాప్స్, కంప్యూటర్ల దిగుమతి నేషేధం
ఇండియాలో ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతి విషయంలో కేంద్రం సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇకపై చైనా(china) నుంచి ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్ల దిగుమతులపై ప్రభుత్వం తక్షణమే ఆంక్షలు విధించింది. ఇవి వెంటనే (ఆగస్టు 3) అమల్లోకి వస్తాయని వెల్లడించింది.
ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు(laptops and computers), పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా-స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతిపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం వెంటనే (ఆగస్టు 3 నుంచి) అమల్లోకి వస్తుందని తెలిపింది. ఈ వస్తువుల దిగుమతులను వ్యతిరేకించినప్పటికీ కొన్ని వినియోగ కేసులు పరిమితుల నుంచి మినహాయించబడ్డాయి. ఆన్లైన్ పోర్టల్‌లు, కొరియర్లు లేదా పోస్ట్ ద్వారా ఒక ల్యాప్‌టాప్, టాబ్లెట్, పర్సనల్ కంప్యూటర్ లేదా అల్ట్రా-స్మాల్ ఫారమ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ని దిగుమతి చేసుకోవడం ఉన్నాయి. బ్యాగేజీ నిబంధనల ప్రకారం దిగుమతులపై ఆంక్షలు వర్తించవని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే పరిశోధన, అభివృద్ధి, బెంచ్ మార్కింగ్, మూల్యాంకనం, మరమ్మత్తు, రీ ఎగుమతి, ఉత్పత్తి అభివృద్ధి కోసం ఒక సరుకుకు ఈ వస్తువులలో ఈనెల 20 వరకు దిగుమతి లైసెన్స్ నుంచి మినహాయింపు కూడా అందించబడింది.
అయితే విదేశాల(foreign) నుంచి వస్తువుల పెద్ద మొత్తంలో కొనుగోళ్లు పడిపోయినప్పటికీ ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులు మాత్రం ఏప్రిల్-జూన్‌లో ఏడాది ప్రాతిపదికన 6.3 శాతం పెరిగి 19.76 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు పెట్రోలియం ఉత్పత్తుల తర్వాత ఎలక్ట్రానిక్ వస్తువులు దేశానికి ఎక్కువగా వస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇలాంటి క్రమంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ఎగుమతి ఏప్రిల్-జూన్‌లో 47.1 శాతం పెరిగి 6.96 బిలియన్ డాలర్లకు చేరుకుందని చేరుకుందని తాజా డేటా వెల్లడించింది. దీంతో మే, జూన్ రెండు నెలల్లోను వాణిజ్య లోటు 20 బిలియన్ డాలర్లకు మించి పోయింది. ఎగుమతులు తగ్గి, దిగుమతులు పెరగడంతో ఇండియా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇప్పటికే Dell, Acer, Samsung, LG, Panasonic, Apple Inc, Lenovo, HP Inc వంటి సంస్థలు ల్యాప్‌టాప్‌లతోపాటు విడిభాగాలను కూడా ప్రధానంగా చైనా(china) నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. మరోవైపు తయారీ రంగాన్ని భారతదేశంలో ప్రోత్సహించడం కూడా ఇందులో భాగమేనని చెబుతున్నారు.