»Chennai Wins By 27 Runs Delhi Is Eliminated From The Ipl 2023 Play Off
IPL 2023: 27 రన్స్ తో చెన్నై గెలుపు..ప్లే ఆఫ్ నుంచి ఢిల్లీ ఖతం
IPL 2023లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్(CSK), ఢిల్లీ క్యాపిటల్స్(DC) మధ్య జరిగిన 55వ మ్యాచ్‌లో చెన్నై గెలుపొందింది. దీంతో ఢిల్లీ జట్టు ప్లే ఆఫ్ ఆశలను కోల్పోగా..చైన్నై చేరువైంది.
ఆతిథ్య చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టు నిన్న 55వ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్(DC)పై 27 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో ఐపీఎల్(ipl 2023) ప్లేఆఫ్‌కు ఆశలను సజీవం చేసుకుంది. కానీ ఇదే సమయంలో ఢిల్లీ జట్టు మాత్రం ప్లేఆఫ్ అవకాశాలను కోల్పోయింది. ఇక తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న MS ధోని జట్టు 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది.
ఈ క్రమంలో ఢిల్లీ బౌలర్లు మిచెల్ మార్ష్ 3, అక్షర్ 2, లలిత్ యాదవ్, కులదీప్ యాదవ్ చెరో వికెట్ తీసి చెన్నై టీం పరుగులను కట్టడి చేశారు. మిచెల్ మార్ష్(mitchell marsh) అద్భుతంగా బౌలింగ్ వేసి ఆఖరి ఓవర్‌ను పూర్తి చేశాడు. కేవలం ఏడు పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి 3/18తో గేమ్ ముగించాడు.
ఇక తర్వాత ఆటకు దిగిన DC బ్యాటర్లు కూడా 168 పరుగుల లక్ష్యాన్ని చేధించలేకపోయారు. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 140 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఈ జట్టు కెప్టెన్ డెవిడ్ వార్నర్(david warner) డకౌట్ కాగా, రిలీ రోసోవ్ 35, మనీష్ పాండే 27, అక్షర్ పటేల్ 21 రన్స్ చేయగా..ఇవే ఈ టీంకు అత్యధిక స్కోర్లు కావడం విశేషం. మరోవైపు చెన్నై బౌలర్లు మతీష పతిరన 3, దీపక్ చాహర్ 2, రవీంద్ర జడేజా ఒక వికెట్ తీసి అద్భతమైన ప్రదర్శన ఇచ్చారు.
అయితే ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) జట్టు 11 మ్యాచులు ఆడగా..ఏడు ఓడిపోయింది. దీంతో ఈ జట్టు ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించింది. మరోవైపు నాలుగుసార్లు చాంపియన్ గా నిలిచిన చెన్నైజట్టు బెర్త్ కు మరింత దగ్గరైంది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో చెన్నై రెండో స్థానంలో కొనసాగుతుంది.