హైదరాబాద్ లోని కూకట్పల్లిలో రసాయనాలు లీకయి స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అక్రమంగా రసాయనాలు నిల్వ చేస్తుండడంతో అవి లీకై తీవ్ర ఘాటు వాసనలు వెలువడ్డాయి. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు. శ్వాస ఆడక అవస్థలు పడ్డారు. ఈ సంఘటన గురువారం ఉదయం 11:30 గంటలకు మొదలై 4 గంటల వరకు కొనసాగింది. ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో అధికారులు చేరుకున్నారు. పోలీసులు, ఫైర్ స్టేషన్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే నివారణ చర్యలు మొదలుపెట్టారు.