»Chandrababu Naidu Questions Ys Jagan Over Ys Vivekananda Murder Case
Chandrababu Naidu: వివేకా హత్య.. ఆ ఇంట జరిగిన కుట్రే, జగనాసుర రక్త చరిత్ర తెలుసు
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క పనిని కూడా చేయలేకపోయారని, చివరకు ఆయన సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Murder Case) నిజమైన నిందితులను కూడా శిక్షించలేకపోయాడని మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu, TDP National president) బుధవారం ట్వీట్ (Twitter) చేశారు.
ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (Chief Minister of Andhra Pradesh YS Jagan Mohan Reddy) అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలో ఒక్క పనిని కూడా చేయలేకపోయారని, చివరకు ఆయన సొంత బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Murder Case) నిజమైన నిందితులను కూడా శిక్షించలేకపోయాడని మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister), తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu, TDP National president) బుధవారం ట్వీట్ (Twitter) చేశారు. ఈ మేరకు వివేకా కేసులో న్యాయం జరగాలంటూ JusticeForYSViveka అనే హ్యాష్ ట్యాగ్ తో వరుసగా మూడు ట్వీట్లు చేశారు.
వివేకా హత్య జగనాసుర రక్త చరిత్రే అని పులివెందుల పూల అంగళ్ల సెంటర్ నుంచి రాష్ట్రం లో ప్రతి ఇంటా తెలుసు అని రెండో ట్వీట్ లో పేర్కొన్నారు. అది ఆ ఇంట జరిగిన కుట్రేనని ఆరోపించారు. తండ్రి శవం పక్కన ఉండగానే ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు సేకరించిన వ్యక్తి… బాబాయ్ హత్య తో రాజకీయ లబ్ధి పొందిన వ్యక్తి… ఇప్పుడు ఆడబిడ్డ అయిన వైయస్ వివేకానంద కూతురు సునీతా రెడ్డికి న్యాయం చేస్తాడా? అని ప్రశ్నించారు.
అంతకుముందు, సునితా రెడ్డి (YS Viveka daughter Sunitha Reddy) మాట్లాడుతూ… తన తండ్రిని ఎవరు హత్య చేశారో ప్రజలకు తెలియాలన్నారు. పులివెందులలో వివేకా ఘాట్ దగ్గర ఆమె కుటుంబ సభ్యులతో కలిసిన నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడారు. పలువురు దర్యాప్తు సంస్థలను ప్రభావితం చేసే విధంగా వ్యవహరిస్తున్నారన్నారు. తనకు తెలిసిన విషయాలు అన్ని సీబీఐకి అందించానని తెలిపారు. కడప, కర్నూల్లో ఇలాంటి హత్యలు సాధారణమేనని కొంతమంది చెప్పారని గుర్తు చేశారు. కానీ తాను తన తండ్రిని ఎవరు చంపారో చెప్పేదాకా వదిలేది లేదన్నారు. ఈ కేసులో కడప ఎంపీ వైయస్ అవినాశ్ రెడ్డిని దర్యాఫ్తు సంస్థ విచారిస్తోన్న విషయం తెలిసిందే.