Next cm అంటూ.. మచిలీపట్నంలో చంద్రబాబుకు తారక్ ప్లెక్సీల సెగ
మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల నుంచి నిరసన ఎదురయ్యింది. నెక్ట్స్ సీఎం తారక్ అంటూ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని చూసి చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
Chandrababu naidu:ఏపీలో అప్పుడే ఎన్నికల హీటెక్కింది. టీడీపీ (tdp), వైసీపీ (ycp) ముఖ్య నేతలు తెగ హడావిడి చేస్తున్నారు. మచిలీపట్నం పర్యటనలో చంద్రబాబుకు (Chandrababu) జూనియర్ ఎన్టీఆర్ (ntr) అభిమానుల నుంచి నిరసన ఎదురయ్యింది. నెక్ట్స్ సీఎం (next cm) తారక్ అంటూ వారు ప్లెక్సీలను ఏర్పాటు చేశారు. వాటిని చూసి చంద్రబాబు (Chandrababu) అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
విజయవాడ- మచిలీపట్నం దారిలో తారక్ (ntr), ఆయన తండ్రి హరికృష్ణ (hari krishna) ప్లెక్సీలు కనిపించాయి. అందులో నెక్ట్స్ సీఎం ఎన్టీఆర్ అని రాసి ఉంది. ఎక్కడ కూడా చంద్రబాబు (Chandrababu), లోకేశ్ (lokesh) ఫొటో కనిపించలేదు. దీంతో ఏంటి ఇదీ అని చంద్రబాబు (Chandrababu) స్థానిక నేతలతో అన్నట్టు తెలిసింది. ఇదీ మంచి పద్దతి కాదు.. ఇలా ప్లెక్సీలు ఏర్పాటు చేసి.. ఏం చెబుతామని అనుకుంటున్నారని చంద్రబాబు మండిపడినట్టు తెలిసింది.
టీడీపీ నేతలు రంగంలోకి దిగి.. ఆ ప్లెక్సీలను చించివేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు (ntr fans) కోపగించుకున్నారు. చంద్రబాబు (Chandrababu) కాన్వాయ్ ముందుకొచ్చి మరీ జై ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు. అలా వారిని టీడీపీ నేతలు పక్కకు తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత మీడియాతో మాట్లాడిన కొందరు ఎన్టీఆర్ ఫ్యాన్స్.. తారక్ ఫోటో పెడితే తప్పేముందని అడిగారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికపై చంద్రబాబు (Chandrababu) ఫోకస్ చేశారు. పార్టీని అధికారం తీసుకురావాలని టార్గెట్ పెట్టుకున్నారు. తన తనయుడు లోకేశ్‌ను (lokesh) సీఎం చేయాలనేది ఆయన లక్ష్యం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇంతలో తారక్ (ntr) పేరు రావడంతో.. చంద్రబాబు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన వ్యుహాం ప్రకారం.. లోకేశ్ (lokesh) యువగళం యాత్ర చేపట్టేలా చేశారు. ఎన్నికల వరకు జనంతో ఉండేలా ప్లాన్ చేశారు. ఇంతలో కొందరు ఇలా ప్లెక్సీలు ఏర్పాటు చేయడంతో చంద్రబాబు (Chandrababu) ఆగ్రహాం వ్యక్తం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు రిపీట్ కానియొద్దని గట్టిగానే చెప్పినట్టు తెలిసింది.