NZB : జిల్లాలో దారుణం జరిగింది. మాక్లూర్ మండలం ధర్మోరలో ఇద్దరు దారుణహత్యకు గురయ్యారు. SI రాజశేఖర్ వివరాల ప్రకారం.. గౌతమ్నగర్కి చెందిన జిలకర ప్రసాద్, తన స్నేహితుడితో కలిసి ఆదివారం రాత్రి ధర్మోరకి వెళ్లాడు. అక్కడ వారి కళ్లల్లో కారం కొట్టి హత్య చేసినట్లు తెలుస్తోంది. కాగా హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.