ఇంటర్నెట్ వినియోగంలోకి వచ్చిన తర్వాత ప్రతి విషయం వెంటనే జనాలకు చేరువ అవుతుంది. చాలా మంది నెట్ లో కనపడినదంతా నిజమని నమ్మేస్తూ ఉంటారు. అందులో ఎంత వరకు నిజం ఉందో లేదో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా గుడ్డిగా ఫాలో అవుతున్నారు. తాజాగా సన్ గ్లాసెస్(sun glasses) పెట్టకుంటే వడ దెబ్బ తగులుతుందే ప్రచారం మొదలైంది. అందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం.
ఎండల నుంచి కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్(Sunglasses) ధరిస్తుంటారు. ముఖ్యంగా బైక్‌లపై వెళ్తున్నప్పుడు వడగాలుల ప్రభావం కంటి మీద పడకుండా చాలామంది కూలింగ్ గ్లాసెస్‌ను వాడుతుంటారు. వీటిని పెట్టుకోవడం వల్ల కళ్ల దగ్గర చల్లగా ఉంటుంది. అయితే సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్లు దెబ్బతింటాయా అని చాలామంది నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే తాజాగా ఇందుకు సంబంధించి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ వైరల్‌గా మారింది.
హెల్త్ ఆప్టిమైజింగ్ బయోహ్యాకర్, సైకాలజీ స్పెషలిస్ట్ టిమ్ గ్రే, తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్లో కళ్ల ఆరోగ్యాన్ని సన్ గ్లాసెస్ ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఓ పోస్ట్ ద్వారా వివరించారు. సూర్యుడి నుంచి వచ్చే UV కిరణాలు చర్మంతో పాటు కళ్లకు హాని కలిగిస్తాయి. అందుకే చాలా మంది చర్మానికి సన్‌స్క్రీన్ అప్లై చేస్తుంటారు. అలాగే కళ్లకు రక్షణగా సన్ గ్లాసెస్ ధరిస్తుంటారు. అయితే వీటి వాడకంతో కంటి ఆరోగ్యం దెబ్బతింటుందని టిమ్ గ్రే అంటున్నారు. అందుకు కారణాలను ఇన్‌స్టా ఫోస్ట్‌లో పేర్కొన్నారు.
‘ఎండ తీవ్రత కారణంగా సూర్యుని నుంచి వచ్చే కిరణాలను కళ్లు ఫిల్టర్ చేస్తాయి. ఎండగా ఉందని మెదడుకు తెలియజేసేందుకు కళ్లు పిట్యుటరీ & పీనియల్ గ్రంథులకు సంకేతాలు పంపుతుంది. చర్మం నేరుగా సూర్యరశ్మి నుంచి విటమిన్ D తయారు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటుంది. అయితే సన్ గ్లాసెస్ ధరించడంతో పరిసరాలు మేఘావృతమయ్యాయని మెదడు భావించే అవకాశం ఉంది. దీంతో ఎండను తట్టుకునేలా చర్మానికి అవసరమైన సంకేతాలను మెదడు ఇవ్వదు’ అని టిమ్ చెప్పారు. మరి దీంట్లో నిజం ఎంత ఉందో తెలుసుకుందాం.
లేదు. సన్ గ్లాసెస్ వడదెబ్బకు కారణం కాదు. సన్ గ్లాసెస్ ధరించడం వల్ల వడదెబ్బ తగులుతుందనేది అపోహ. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు అని వైద్యులు ధ్రువీకరించారు. సన్ గ్లాసెస్ ధరించడం వల్ల కళ్ల చుట్టూ ఉన్న చర్మానికి నీడ అందుతుందని, సూర్యరశ్మికి ప్రత్యక్షంగా బహిర్గతం కాకుండా ఉండవచ్చని, ఇది మెలనిన్ ఉత్పత్తిని నిరోధించదని వైద్యులు తెలిపారు.
మరి సాధారణంగా వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి?
సన్‌స్క్రీన్‌ని వర్తించండి: ముఖం, శరీరంతో సహా చర్మం బహిర్గత ప్రాంతాలపై అధిక సూర్యరశ్మి రక్షణ కారకంతో విస్తృత స్పెక్ట్రమ్ సన్‌స్క్రీన్‌ను ఉపయోగించండి. ముఖ్యంగా స్విమ్మింగ్ లేదా చెమట పట్టిన తర్వాత క్రమం తప్పకుండా సన్‌స్క్రీన్‌ని మళ్లీ అప్లై చేయండి.
నీడను వెతకండి: సూర్యుడు ఎక్కువగా ఉన్నప్పుడు, సాధారణంగా ఉదయం 10 , సాయంత్రం 4 గంటల మధ్య, నీడ ఉన్న ప్రదేశాలలో ఉండటానికి ప్రయత్నించండి. లేదా నేరుగా సూర్యరశ్మిని తగ్గించడానికి గొడుగులు ఉపయోగించండి.
రక్షిత దుస్తులను ధరించండి: UV రేడియేషన్ నుంచి అదనపు భౌతిక రక్షణను అందించడానికి టోపీలు, పొడవాటి చేతుల చొక్కాలు, ప్యాంటు వంటి దుస్తులతో మీ చర్మాన్ని కప్పుకోండి. UV రక్షణతో సన్ గ్లాసెస్ ఉపయోగించండి. హానికరమైన UV కిరణాల నుంచి మీ కళ్ళను రక్షించడానికి 100% UV రక్షణను అందించే సన్ గ్లాసెస్‌ని ఎంచుకోండి.